Supritha : ఆ పని చేస్తూ అమ్మకి దొరికిపోయా.. ఓపెన్ కామెంట్స్ చేసిన సుప్రీత..!!

Supritha : తెలుగు సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా పేరు సంపాదించిన నటి సురేఖవాణి.. ఈమె ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఎన్నో చిత్రాలలో తన వైవిధ్యమైన కామెడీతో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఈమె కూతురు సుప్రీత కూడా నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ మంచి క్రేజ్ క్రియేట్ సంపాదించుకుంది.. హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి పలు రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంది సుప్రీత.. తాజాగా బిగ్ బాస్ ఫేమ్ అమర్ దీప్ తో ఒక సినిమాని చేయబోతున్నట్లు ఇటీవలే ప్రకటించారు. ఈ సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు కూడా పూర్తీ అయ్యాయి.

అమర్దీప్ – సుప్రీత తో యాంకర్ రీతూ చౌదరి..

అయితే ఈ సినిమా విడుదలకు ముందే జనాలలోకి తీసుకువెళ్లాలనే ప్రయత్నం చేస్తోంది సుప్రీత.. అందుకే అమర్ దీప్, సుప్రీతలు ఇద్దరు కలిసి దావత్ అనే ఒక షో కి గెస్ట్లుగా రావడం జరిగింది.. ఈ షోకి యాంకర్ గా జబర్దస్త్ నటి రీతూ చౌదరి వ్యవహరిస్తున్నది.. ఈ షోలో ఎన్నో తెలియని విషయాలను కూడా ఆమె అడిగి గెస్ట్లుగా వచ్చిన వారితో బయటకు చెప్పిస్తూ ఉంటుంది.. ఈ షో కి గెస్ట్లుగా వచ్చిన అమర్దీప్, సుప్రితను కూడా ఇలా అడుగుతూ.. మీ జీవితంలో కిక్ తో చేసే పనులు.. క్రాక్ తో చేసే పనులు.. బలుపుతో చేసే పనులు ఉంటాయి కదా .. ఆ పనులు ఏంటో.. మీ ఇద్దరు ఏం చేశారో చెప్పాలని కోరింది రీతూ చౌదరి..

రీతూ చౌదరి ప్రశ్నలకు సప్రీత సమాధానమిదే..

ఈ ప్రశ్నకు ముందుగా సురేఖ వాణి కూతురు సుప్రీత మాట్లాడుతూ.. తాను 16వ ఏటనే లైసెన్స్ లేకుండా కారు నడిపేదాన్ని.. అది తనకు చాలా కిక్ ఇచ్చిందంటూ తెలియజేసింది.. అలాగే పదవ తరగతిలో తన తాగుడు గురించి బయటపడిందని.. నేను కూడా అలాంటిది చేశాను కానీ చెప్పలేననీ.. చెప్పేసింది సుప్రీత.. ముఖ్యంగా టెన్త్ క్లాసులో ఒక గ్యాంగ్ ఉందని.. వారందరికీ తానే మందు తాగించానని అది తన తల్లి సురేఖ వాణికి తెలిసి తనను పిచ్చ కొట్టుడు కొట్టిందని తెలిపింది.అలాగే తన బాయ్ ఫ్రెండ్ తో ఎవరైనా అమ్మాయి మాట్లాడితే కచ్చితంగా ఆ అమ్మాయిని కొట్టేదాన్ని అంటూ ఈ షోలో ఎన్నో సీక్రెట్లను సైతం తెలియజేసింది అందుకు సంబంధించిన ఒక వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నది.. ఈ వీడియో చూసిన సురేఖ వాణి , సుప్రీత అభిమానులు ఒకసారిగా ఆశ్చర్యపోతున్నారు..

- Advertisement -

సురేఖ వాణి కెరియర్..

ఇక సురేఖ వాణి కెరియర్ విషయానికి వస్తే.. ఒకప్పుడు పలు చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అక్క, అత్త, అమ్మ పాత్రలలో అలరించిన ఈమె ఇప్పుడు అవకాశాలు తగ్గిపోయాయంటూ మీడియాతో వెల్లడించిన విషయం తెలిసిందే.. ఇక తాజాగా మోహన్ బాబు అలాగే మంచు విష్ణు ల డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప సినిమాలో ఈమె నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా లో తన పాత్ర యొక్క షూటింగ్ ను కూడా పూర్తి చేసుకుంది.. మొత్తానికైతే ఈ సినిమా సక్సెస్ అయితే మళ్లీ ఆమెతో అవకాశాలు వస్తాయి అనడంలో సందేహం లేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు