HBD Prakash Raj : రూ.300తో కెరీర్ స్టార్ట్… ఇప్పుడు ప్రకాష్ రాజ్ రెమ్యూనరేషన్ ఎంతంటే?

HBD Prakash Raj : విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ పుట్టినరోజు (HBD Prakash Raj) నేడు. సౌత్ ఇండస్ట్రీలో ఎలాంటి పాత్రనైనా చేయగలిగే సత్తా ఉన్న యాక్టర్ గా ఆయన పేరు తెచ్చుకున్నారు. రంగస్థల నటుడిగా కెరీర్ ను ప్రారంభించి, ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ సీనియర్ నటుడిగా ఎదిగారు. భాషతో సంబంధం లేకుండా, నార్త్ సౌత్ అనే తేడా లేకుండా పలు భాషల్లో వందలాది సినిమాల్లో నటించి విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. హీరోగా, విలన్ గా, డైరెక్టర్ గా, నిర్మాతగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సౌత్ ఆడియన్స్ గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు ప్రకాష్ రాజ్. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా కెరీర్ మొదట్లో కేవలం రూ.300 మాత్రమే అందుకున్న ప్రకాష్ రాజ్ ఇప్పుడు ఎంత రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు అనే ఆసక్తికరమైన విషయాన్ని తెలుసుకుందాం.

ప్రకాష్ రాజ్ పారితోషికం ఎంత?

1965 మార్చి 26న కర్ణాటకలోని ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ప్రకాష్ రాజ్ రంగస్థల నటుడిగా కెరీర్ ను ప్రారంభించారు. అప్పట్లోనే ఆయన రెండు వేలకు పైగా ప్రదర్శనలు ఇవ్వగా, అప్పట్లో స్టేజ్ పై ఒక్కో ప్రదర్శన కోసం ఆయన రూ. 300 రూపాయలు పారితోషకంగా తీసుకున్నారట. ఆ తర్వాత కన్నడ సినిమాలతో సినీ కెరీర్ ప్రారంభించిన ప్రకాష్ రాజ్ కు 1994లో కే బాలచందర్ దర్శకత్వంలో వచ్చిన “డ్యూయెట్” అనే సినిమాతో గుర్తింపు దక్కింది. 1998లో మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన “ఇద్దరు” మూవీతో ఉత్తమ సహాయ నటుడిగా మొట్టమొదటిసారి నేషనల్ అవార్డును దక్కించుకున్నారు ప్రకాష్ రాజ్. ఆ తర్వాత ప్రకాష్ రాజ్ కు అవకాశాల వెల్లువ మొదలైంది. 1995లో “సంకల్పం” సినిమాతో టాలీవుడ్ మెట్లు ఎక్కారు ఈ విలక్షణ నటుడు. ఆ తర్వాత ఆయన వెనుదిరిగి చూసుకోలేదు. ఇప్పటిదాకా ప్రకాష్ రాజ్ అన్ని భాషల్లో కలిపి ఏకంగా 400 సినిమాలకు పైగా చేశాడు.

అందులో తెలుగు సినిమాలే ఎక్కువగా ఉండడం విశేషం. నాటి నుంచి నేటి వరకు హీరోగా, విలన్ గా, అన్నగా, మామగా, తండ్రిగా, తాతగా ప్రకాష్ రాజ్ పోషించిన పాత్రలు మరపురానివి. ఒకానొక సమయంలో ప్రకాష్ రాజ్ లేని సినిమా లేదంటే అతిశయోక్తి కాదు. అయితే మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఈ రేంజ్ లో పాపులారిటీ ఉన్న ప్రకాష్ రాజ్ ప్రస్తుతం ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు? అంటే సమాధానం లేదు. ఒకానొక సందర్భంలో ఆయన్ననే తన రెమ్యూనరేషన్ గురించి ప్రశ్నించగా తెలివిగా తప్పించుకున్నారు తప్ప సమాధానం మాత్రం చెప్పలేదు. కానీ ఆయన ఏడాదికి 3 కోట్లు సంపాదిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. కేవలం నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా ప్రకాష్ రాజ్ సంపాదిస్తున్నారు.

- Advertisement -

వివాదాలకు కేరాఫ్ అడ్రస్…

ఇక సినిమాతోనే కాదు వివాదాలతో కూడా ప్రకాష్ రాజ్ ఫుల్ పాపులర్. వివాదాలకు ఆయన కేరాఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు. సినిమాలో ఎంత విలక్షణంగా నటిస్తాడో నిజ జీవితంలో కూడా అంతే విలక్షణంగా ప్రవర్తిస్తూ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పేస్తాడు ప్రకాష్ రాజ్. జస్ట్ ఆస్కింగ్ అంటూ సోషల్ మీడియాలో ఆయన సంధించే ప్రశ్నలు ఎన్నో మార్లు వివాదాలకు తెరతీసాయి. ఇప్పటివరకు ఆయనను సినీ పరిశ్రమ ఆరుసార్లు బ్యాన్ చేసింది అంటేనే ఈయన వివాదాలు ఏ రేంజ్ లో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు