Mani ratnam: ps2 ఆంథెమ్ సాంగ్ రిలీజ్.. ఏ.ఆర్ రహ్మాన్ స్పెషల్

పొన్నియిన్ సెల్వన్ చిత్ర యూనిట్ తమ ప్రమోషన్ లో జోరు మీదుంది. ఎప్పటికప్పుడు ఈ సినిమా కి సంబంధించిన పాటలు గాని, స్టిల్స్ గాని, ఇంకేదైనా అప్డేట్ ని రిలీజ్ చేస్తూ PS 2 పై హైప్ పెంచుతున్నారు. మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ గా వస్తున్న ఈ సినిమా మొదటి భాగం 2022 సెప్టెంబర్ లో విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పుడు పొన్నియిన్ సెల్వన్ యొక్క రెండో భాగం ఏప్రిల్ 28 న విడుదల అవుతుంది. భారీ తారాగణం తో లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం స్వీయ నిర్మాణంలో తెరకెక్కించాడు. ఈ సినిమా లో విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష, శోభిత ధూళిపాళ హీరో హీరోయిన్లు గా నటించారు. ఇక ప్రకాష్ రాజ్, రెహమాన్, ప్రభు, శరత్ కుమార్, జయరాం, ఐశ్వర్య లక్ష్మి, పార్తీబన్ కీలక పాత్రల్లో నటించారు.

పొన్నియిన్ సెల్వన్ చిత్రానికి ఏ.ఆర్ రహ్మాన్ సంగీతం అందించాడు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన PS 2 ఆంథెమ్ సాంగ్ రిలీజ్ అయింది. ఈ పాటలో  రహ్మాన్  తన మ్యూజిక్ తో మెస్మరైజ్ చేయగా తానే ఈ పాట పాడి సాంగ్ లోను కనిపించడం జరిగింది. చోళుల చరిత్రను అలాగే వారి వీర పరాక్రమాలను గురించి ఈ పాట ద్వారా చెప్పడం జరిగింది.

పొన్నియిన్ సెల్వన్ ఆంథెమ్ సాంగ్ ను ప్రముఖ రచయిత చంద్రబోస్ రాయడం జరిగింది. అయితే ఈ సాంగ్ ను తమిళ్ లో ఏ.ఆర్ రహ్మాన్ పాడగా, తెలుగు లో హరి హరన్ పాడారు. ఇక ఈ పాటలో పొన్నియిన్ సెల్వన్ ని మహారాజును చేస్తున్నట్టు చూపించడం జరిగింది. ఇక పొన్నియిన్ సెల్వన్ 2 వచ్చే వరకు మరెన్ని అప్ డేట్స్ ఇస్తారో చూడాలి.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు