kanguva : సూర్య మూవీ టైటిల్ వచ్చేసింది

సూర్య హీరోగా స్టూడియో గ్రీన్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న సినిమా కి “కంగువ ” అనే టైటిల్ ని ఖరారు చేశారు. శివ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాని 10 భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి చాల మంచి స్పందన లభించింది.

 

1678 లోని ఒక మరాఠా యోధుడు అంతు చిక్కని ఒక వ్యాధి తో చనిపోయారు. అతని చావు వెనక ఉన్న కారణాలు, అతని సాహసాలు , సాధించిన విజయాలు ఏంటి.. అనే కథాంశంతో ఈ సినిమా ఉండబోతుందట. ప్రస్తుతం తమిళ్ ఇండస్ట్రీ నుంచి వస్తోన్న అతి పెద్ద ప్రాజెక్ట్ ఇదే. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయినా మణిరత్నం “పొన్నియన్ సెల్వన్” తమిళ్ లో ఘన విజయం సాధించిన, మిగితా భాషల్లో నిరాశ పరిచింది. దాంతో ఇప్పుడు తమిళ్ ఇండస్ట్రీ తమ ప్రైడ్ గా భావించి తెరకెక్కిస్తున్న సినిమా ఈ ” కంగువ ”

- Advertisement -

కంగువ అంటే మండుతున్న అగ్ని అనే అర్థం వస్తుంది. దీన్ని బట్టి చూస్తే సూర్య సినిమాలో ఎలా ఉండబోతున్నారు అనేది తెల్సుతోంది. తెలుగులో ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ సంస్థ రిలీజ్ చేస్తున్నారు. డైరెక్టర్ శివ & టీం ఈ సినిమా పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.సూర్య కి మొదటి పాన్ ఇండియన్ సినిమా కావడంతో ఏ విషయం లోను తగ్గకుండాచాలా జాగత్తగా వ్యవహరిస్తున్నారు.

సూర్య కి తెలుగు లో మంచి మార్కెట్ ఉండడం తో మన తెలుగు లోను ఈ సినిమా చాలా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. అయితే ఆ మధ్య వీళ్ళు తెలుగు లో వచ్చిన బాహుబలి , RRR సినిమాలకి సూర్య “కంగువ “నే మా సమాధానం అని కామెంట్స్ కూడా చేసారు. మరి చూడాలి కంగువ ఎలా ఉండబోతుందో. జనవరి 2024 లో సినిమా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ దాదాపు చివరి దశకి చేరుకుంది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ చాలా వరకి పెండింగ్ ఉండడంతో రిలీజ్ ఎప్పుడూ చేస్తారు అనే విషయం పై యూనిట్  ఖచ్చితమైన డేట్ ని ప్రకటించలేదు.

 

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు