Chiranjeevi: ఆ విషయంలో చిరుకి అండగా టాలీవుడ్ స్టార్స్..!

సినీ ఇండస్ట్రీలో దర్శకరత్న దాసరి నారాయణరావు మరణించిన తర్వాత ఇండస్ట్రీకి పెద్దదిక్కు ఎవరు అన్న ప్రశ్న ఇప్పటికీ సందేహంగానే మారింది. ముఖ్యంగా ఇండస్ట్రీలో సినీ పెద్ద అనగానే చిరంజీవి పేరు వినిపిస్తున్నా.. కొంతమంది మాత్రం మోహన్ పేరును బయటకు తీస్తున్నారు.. పైగా మరొకవైపు మోహన్ బాబు కూడా తానే ఇండస్ట్రీకి పెద్ద అన్నట్టు బిహేవ్ చేస్తున్నారని కొంతమంది నుంచి వినిపిస్తున్న వార్తలు.. వాస్తవానికి చిరంజీవి ఇండస్ట్రీకి పెద్దదిక్కుగా ఉండాలని అనుకోవట్లేదు.. పైగా ఆయన ఇండస్ట్రీకి ఏదైనా కష్టం వస్తే మాత్రం.. ముందుండి కష్టాన్ని తీరుస్తున్నారే తప్ప ఆ పదాన్ని ఒప్పుకోవడం లేదు. అంతేకాదు కరోనా సమయంలో సినీ పరిశ్రమకు ఇబ్బందులు ఎదురైనప్పుడు దగ్గరుండి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తో సంప్రదింపులు జరిపి సినీ కార్మికుల కోసం తన వంతు సహాయాన్ని అందించారు.. అంతేకాదు థియేటర్లలో టికెట్లు రేట్లు తగ్గించి నిర్మాతలకు ఇబ్బంది పెట్టిన సమయంలో కూడా చిరంజీవి ముందుండి టికెట్ ధరల రేట్లు పెంచేలా చేశారు.. దీన్ని బట్టి చూస్తే.. ఇండస్ట్రీ బాగు కోసం చిరంజీవి తీసుకున్న చొరవే ఆయనను ఇండస్ట్రీ పెద్దగా నిలబెడుతోంది.. ఈ క్రమంలోనే ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీలు చిరంజీవికి అండగా నిలుస్తున్నారు..

చిరు – మోహన్ బాబు మధ్య వాగ్వాదం..
ఇదిలా వుండగా.. చిరంజీవి , మోహన్ బాబుల మధ్య ఇండస్ట్రీ పెద్ద ఎవరు అనే విషయంపై వాగ్వాదం జరిగింది. ఇక మోహన్ బాబు తనకు తానుగా ఇండస్ట్రీ పెద్దగా ఉండబోతున్నానని ప్రకటించడంతో ఈ వాగ్వాదం కాస్త ఎక్కువైంది.. కానీ చిరంజీవి దీనిపై స్పందించి ఇండస్ట్రీ పెద్దగా తాను ఉండాల్సిన అవసరం లేదని.. తన వరకు ఏదైనా సమస్య వస్తే సాల్వ్ చేస్తానని ఓపెన్ గా చెప్పడంతో ఈ వివాదం కాస్త సద్దుమణిగింది.

చిరుకి అండగా టాప్ సెలబ్రిటీలు..
ఇకపోతే తాజాగా చిరంజీవి ఇండస్ట్రీ పెద్దగా ఉండాలి అంటూ ప్రభాస్, మహేష్ బాబు, నాగార్జున,రాజమౌళి వంటి స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లు కోరుకుంటూ ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇప్పటికైనా ఇండస్ట్రీ పెద్దగా ఇండస్ట్రీలో జరిగే సమస్యల పైన పోరాటం చేస్తారా లేదా అంటూ అడుగుతున్నట్లు తెలుస్తోంది.. మరి వీరి కోరిక మేరకైనా చిరంజీవి ఇండస్ట్రీ పెద్దగా నిలబడతారేమో చూడాలి.

- Advertisement -

చిరంజీవి సినిమాలు..
ఇక చిరంజీవి కెరియర్ విషయానికి వస్తే.. 7 పదుల వయసుకు చేరువలో ఉన్నా కూడా వరుస సినిమాలు చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. గత ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఈయన భోళా శంకర్ సినిమాతో పూర్తిగా డిజాస్టర్ పాలయ్యారు.. ఇక దీంతో ఎలాగైనా సరే మంచి సక్సెస్ అందుకోవాలని ప్రయత్నం చేస్తున్న చిరంజీవి.. బింబిసారా దర్శకుడు వశిష్ట మల్లిడి దర్శకత్వంలో విశ్వంభర సినిమాని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్లు రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించారు.. మరి ఈ సినిమాతో చిరంజీవి ఎటువంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు