Mamitha baiju : గ్లోబల్ స్టార్ పై మనసుపారేసుకున్న ప్రేమలు హీరోయిన్..

టాలీవుడ్ లో ఈ వారం రెండు తెలుగు సినిమాలతో పాటు ఓ డబ్బింగ్ సినిమా కూడా రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఆ సినిమాయే మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన “ప్రేమలు” సినిమా. ఈ సినిమాలో నెల్సన్ కె, మామితా బైజు హీరో, హీరోయిన్లు గా నటించడం జరిగింది. ఇక రెండు వారాల కింద మలయాళంలో రిలీజ్ అయిన ఈ సినిమా అక్కడ సూపర్ హిట్ టాక్ తో బ్లాక్ బస్టర్ వసూళ్లు సాధిస్తూ ఏకంగా వంద కోట్ల వసూళ్ల దిశగా దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాను తాజాగా మార్చి 8న తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. ఇక తెలుగు వెర్షన్ హక్కుల్ని రాజమౌళి తనయుడు కార్తికేయ దక్కించుకుని తెలుగులో రిలీజ్ చేస్తున్నాడు. కాగా ప్రేమలు హీరోయిన్ మామితా బైజు తాజాగా తెలుగు ఇంటర్వ్యూ లో కూడా పాల్గొనింది. ఇక ఈ ఇంటర్వ్యూ లో కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను కూడా తెలియచేసింది.

రామ్ చరణ్ అంటే చాలా ఇష్టం..

ప్రేమలు మూవీ తెలుగు ప్రమోషన్ లో భాగంగా మామితా బైజు, అలాగే సినిమాలో కీలక పాత్రలో నటించిన సంగీత్ ప్రతాప్ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. ఇక ప్రేమలు గురించి చెప్తూ ఈ సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని ఊహించలేదు. ఇక తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నందుకు చాలా హ్యాపీ గా ఉందని హీరోయిన్ మామితా బైజు అంది. అలాగే తెలుగు సినిమాలు కూడా తన స్కూల్ డేస్ నుండి చూసే దాన్ని అని, కొన్ని డబ్ వెర్షన్ చూస్తే, మరికొన్ని డైరెక్ట్ తెలుగు సినిమాలు కూడా చూసేదాన్ని అని చెప్పింది. ఇక తన ఫెవరేట్ తెలుగు హీరో రామ్ చరణ్ అని ఆయన సినిమాలు చిన్నప్పటినుండీ చూస్తానని, తన సినిమాలు టివిలో వేసినా కూడా వదిలేదాన్ని కాదని, తనతో కలిసి ఒక్క సినిమా అయినా చేయాలనీ ఉందని మామితా చెప్పుకొచ్చింది.

- Advertisement -

మగధీర కోసం టైం టేబుల్ వేసుకుని మరీ..

రామ్ చరణ్ అంటే చాలా ఇష్టమని చెప్పుకొచ్చిన మామితా బైజు మగధీర సినిమా ని ఎన్నో సార్లు చూశానని చిన్నప్పుడు ఆ సినిమా కోసం ప్రతి శనివారం టైం టేబుల్ సెట్ చేసుకుని మరీ చూసేదాన్ని అంటూనే, ఎగ్జామ్స్ వచ్చినా కూడా ఈ సినిమాకోసం టైం కేటాయించేదాన్ని అని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత రంగస్థలం, RRR కూడా చాలా సార్లు చూశానని అంది.  ఇక ప్రేమలు విషయానికి వస్తే హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లోనే ఈ సినిమా తెరకెక్కడం వల్ల టాలీవుడ్ ఆడియన్స్ కి ఖచ్చితంగా నచ్చుతుందని ట్రేడ్ విశ్లేషకులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  ముఖ్యంగా మల్టీ ప్లెక్స్ లో ఈ సినిమాకు ఏ,బి సెంటర్ల ఆడియన్స్ ఎగబడతారని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రేమలు చిత్రానికి గిరీశ్ AD దర్శకత్వం వహించగా, విష్ణు విజయ్ సంగీతం అందించాడు.  మరి చూడాలి ఈ సినిమా ఎంతవరకు తెలుగు జనాల్ని మెప్పిస్తుందో.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు