Tollywood stars: చైల్డ్ ఆర్టిస్ట్ లుగా వచ్చి స్టార్ స్టేటస్ అందుకున్న సెలబ్రిటీలు వీరే..!

ఎవరైనా సరే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ కావాలని చాలా ఆశగా అడుగు పెడుతూ ఉంటారు. ముఖ్యంగా స్టార్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న సెలెబ్రెటీల వారసులు కూడా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయిన వారు ఉన్నారు.. అలాగే ఫెయిల్యూర్ అయిన వారు కూడా ఉన్నారు.. నిజానికీ చిన్న వయసులోనే స్టార్ స్టేటస్ నిలబెట్టుకోవడం అనేది చాలా కష్టమైన పని.. అయితే కొంతమంది హీరోలు మాత్రం చిన్న వయసులోనే ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అందుకోవడమే కాదు స్టార్ స్టేటస్ ను సైతం అందుకున్న వారు ఉన్నారు. మరి వారి గురించి ఎప్పుడు చూద్దాం..

జూనియర్ ఎన్టీఆర్:
జూనియర్ ఎన్టీఆర్ చిన్న వయసులోనే చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి.. బాల రామాయణం సినిమాలో నటించి స్టార్ స్టేటస్ అందుకున్నారు.. స్టూడెంట్ నెంబర్ వన్ , ఆది , సింహాద్రి సినిమాలతో హీరోగా మంచి క్రేజ్ అందుకున్నారు. అంతేకాదు ఆ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ ని సృష్టించారు. ఆది సినిమా రిలీజ్ అయ్యే సమయానికి ఆయన వయసు 20 సంవత్సరాల లోపే ఉండడం గమనార్హం.. ఇక ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏకంగా గ్లోబల్ స్టార్ డం ను సొంతం చేసుకున్నారు.

రామ్ పోతినేని..
చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయిన మరొక హీరో రామ్.. చిన్న వయసులోనే సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు.. ఆ తర్వాత దేవదాస్ సినిమాతో హీరోగా తన కెరీర్ ని మొదలుపెట్టి .. అక్కడి నుంచి ఇప్పటివరకు కెరియర్ పరంగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.. ప్రస్తుతం డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్లో నటిస్తున్నారు.. ఈ సినిమా ఈ ఏడాది విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -

నితిన్..
యంగ్ హీరో నితిన్ కూడా చిన్న వయసులోనే ఎంట్రీ ఇచ్చి స్టార్ స్టేటస్ ని అందుకున్నారు.. హీరో నితిన్ కెరియర్ లో ఎన్నో ఫ్లాప్ లు ఎదురైనప్పటికీ వాటన్నిటిని ఎదుర్కొని మరీ ఎన్నో సినిమాలతో సక్సెస్ లు అందుకున్నారు.. గత ఏడాది ఎక్స్ట్రాడినరీ మ్యాన్ సినిమాతో పర్వాలేదు అనిపించుకున్నారు నితిన్..

తరుణ్..
హీరో తరుణ్ కూడా చిన్న వయసులోనే ఎంట్రీ ఇచ్చి స్టార్ స్టేటస్ ని అందుకున్నారు.. వరుస సినిమాలతో భారీ క్రేజ్ అందుకున్న తరుణ్ కొన్ని సంవత్సరాల తర్వాత తన కథల ఎంపిక విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేక డిజాస్టర్స్ మూవీలను మూట కట్టుకున్నారు.. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీకి దూరమై సొంతంగా బిజినెస్లను చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే సొంత టాలెంట్ ఉండడం వల్ల ఈ హీరోలు చిన్న వయసులో భారీ క్రేజ్ సంపాదించుకున్నారు..

ఇకపోతే సినీ ఇండస్ట్రీలోకి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన కొంతమంది హీరోలు స్టార్ స్టేటస్ ని అందుకోగా మరి కొంతమంది స్టార్ స్టేటస్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.. ఇంకొంతమంది అప్పుడు సక్సెస్ అయ్యి ఇప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోలేక ఇండస్ట్రీకి దూరమయ్యారు..

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు