Bhimaa :పోటీపడి మరీ ప్రమోట్ చేస్తున్నారు.. హిట్టయితే క్రెడిట్ ఎవరికో?

టాలీవుడ్ లో ఈ వారం రిలీజ్ అవుతున్న క్రేజీ సినిమాల్లో “భీమా” మూవీ ఒకటి. మ్యాచోస్టార్ గోపీచంద్ చాలా రోజుల తర్వాత పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ సినిమా మార్చి 8న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. ఇక ఈ సినిమా టీజర్ ట్రైలర్ ఇప్పటికే ఆకట్టుకోగా, చిత్ర యూనిట్ రిలీజ్ టైం లోగా మంచి బజ్ క్రియేట్ చేయాలనీ ప్రమోషన్లలో బిజీ అయ్యారు. రీసెంట్ గానే ప్రీ రిలీజ్ ఈవెంట్ వరంగల్ లో గ్రాండ్ గా నిర్వహించిన మూవీ మేకర్స్, అంతకంటే ముందు నుండే ప్రమోషనల్ టూర్లు కూడా వేశారు. ఇక చిత్ర యూనిట్ గోపీచంద్ సహా సోషల్ మీడియాలో పలు ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీ అయ్యారు. ఇక ఈ సినిమాలో మాళవిక శర్మ, ప్రియా భవాని శంకర్ హీరోయిన్లుగా నటించారన్న విషయం తెలిసిందే. ఈ కమర్షియల్ చాలా హోప్స్ పెట్టుకున్న ఈ ఇద్దరూ, భీమా కోసం ప్రమోషన్లలో తెగ బిజీ అయ్యారు.

ఇద్దరూ హీరోయిన్లు పోటాపోటీ..

ఇక ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించిన మాళవికా శర్మ ప్రియా భవాని శంకర్ తమ ప్రమోషన్లతో సినిమాపై మంచి బజ్ తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఇద్దరూ కలిసి దాదాపు పదికి పైగా ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో పాల్గొనడం జరిగింది. పైగా ఈ సినిమా హిట్ అవ్వడం ఇద్దరు హీరోయిన్లలకు కూడా ఇంపార్టెంట్. ఇక మాళవిక శర్మ తెలుగు సినిమాతోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వగా, సక్సెస్ మాత్రం ఇప్పటివరకూ రాలేదు. అందుకే భీమా పై బాగా హోప్స్ పెట్టుకుంది. ఇక ప్రియా భవాని శంకర్ లాస్ట్ ఇయర్ కళ్యాణం కమనీయం తో ఎంట్రీ ఇచ్చినా ఆ సినిమా అంతగా ఆడలేదు. ఇప్పుడు రెండోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది.

- Advertisement -

ఇద్దరిలో క్రెడిట్ ఎవరికీ?

అయితే భీమా సినిమాలో మాళవిక శర్మ, ప్రియా భవాని శంకర్ ఇద్దరు హీరోయిన్లు నటించినా ట్రైలర్ లో వీళ్ళ గురించి పెద్దగా చూపించలేదు. అలా ఒక్కో షాట్ లో కనిపించి వెళ్ళిపోతారు. అయితే ఈ సినిమాలో ఒక స్కూల్ టీచర్ గా మాళవిక కనిపిస్తుందని ఆ మధ్య పాటతో తెలిసింది. కానీ మాళవిక శర్మ క్యారెక్టర్ గురించి రివీల్ చేయలేదు. అయితే ఈ సినిమాలో ఏ హీరోయిన్ కి ఇంపార్టెన్స్ ఎక్కువగా ఉంది అని చర్చ నడుస్తుంది. ఆ మధ్య గుంటూరు కారంలో మీనాక్షి సెకండ్ హీరోయిన్ అన్నా ఆ పాత్రకు ఏ ఇంపార్టెన్స్ లేకుండా పోయింది. అలాగే ఈ సినిమాలో హీరోయిన్లకు ఇంపార్టెన్స్ ఉందా లేదా అన్న విషయం పై ఆసక్తి నెలకొంది.

అయితే సినిమా కోసం మాత్రం పోటీపడి మరీ చేస్తున్నారు మాళవిక శర్మ , ప్రియాభవాని శంకర్. మరి సక్సెస్ అయ్యాక ఏ హీరోయిన్ కి క్రెడిట్ వెళ్తుందో. ఇక భీమా సినిమాను కన్నడ స్టార్ డైరెక్టర్ హర్ష దర్శకత్వం వహించగా, ఈ సినిమాను శ్రీ సత్య సాయి ఆర్ట్స్ బ్యానర్ పై రాధా మోహన్ నిర్మించడం జరిగింది.రవి బాసూర్ సంగీతం అందించాడు. ఇక భీమా ఆన్లైన్ బుకింగ్స్ అల్రెడి మొదలైపోయాయి.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు