Chiranjeevi : చిరుతో పోటీ కాదు.. చిరుని మించి డాన్స్ లో పోటీ ఇచ్చిన హీరోయిన్!

టాలీవుడ్ లో డాన్స్ గురించి మాట్లాడితే ముందుగా చెప్పుకోవాల్సింది మెగాస్టార్ చిరంజీవి. ఇండస్ట్రీ కి వచ్చిన కొత్త లోనే బ్రేక్ డాన్సులు, పాప్ డాన్సులు, డిస్కో డాన్సులు పరిచయం చేసిన ఘనత చిరుది. ఇప్పుడు టాలీవుడ్ కి ఏ హరేమో వచ్చినా సరే చిరుని ఇన్స్పైర్ అయ్యే వచ్చామని ఇప్పటికి చెప్తూ ఉంటారు. ముఖ్యంగా డాన్సర్లు, కొరియోగ్రాఫర్లు అయితే చిరంజీవి పేరు తలవని రోజే ఉండదు. సౌత్ బడా కొరియోగ్రాఫర్లు అయిన ప్రభుదేవా, రాఘవలారెన్స్ మాస్టర్లు చిరంజీవి సినిమాలతోనే స్టార్స్ అయ్యారని తెలిసిందే. ఇక 90స్ లో అయితే ఇండియాలోనే చిరు తో సమానంగా డాన్స్ చేసే హీరోలు లేరంటే అతిశయోక్తి కాదు. అలాంటి మెగాస్టార్ చిరంజీవితో డాన్స్ చేయాలంటే హీరోయిన్లు కూడా ఎంతో కష్టపడాల్సి వచ్చేది.

చిరుతో బెస్ట్ డాన్స్ పార్ట్నర్స్..

అయితే 80 స్ కాలంలో మాత్రం చిరంజీవి తో డాన్స్ అంటే ఓ ముగ్గురు హీరోయిన్లు మాత్రమే ఆయనతో పోటీనిచ్చి బెస్ట్ డాన్స్ అవుట్ ఫుట్ ఇచ్చేవారు. వారే రాధికా శరత్ కుమార్ , రాధ, విజయశాంతి. 1982 నుండి వీళ్ళతో సినిమాలు చేసిన చిరు దాదాపు పదేళ్ల పాటు వరుస సినిమాలు చేసేవారు. మాస్ స్టెప్స్ అయితే రాధిక తో, బ్రేక్ డాన్స్ లు, డిస్కో డాన్స్ లు అయితే విజయశాంతి , రాధ లతో ఎక్కువగా చేసేవారు. వీళ్ళ కాంబోలో మూవీ అంటే అప్పట్లో పాటల కోసమే వచ్చేవారు ఆడియన్స్. ఒకవేళ సినిమాలో అంత విషయం లేకపోయినా, పాటలతో హిట్టయిన సందర్భాలు కూడా ఉన్నాయి. దొంగమొగుడు, పసివాడి ప్రాణం, యముడికి మొగుడు లాంటి చిత్రాల్లో చిరంజీవి తో ఈ హీరోయిన్లు వేసిన స్టెప్స్ కి ఇప్పటికీ ఓ రేంజ్ లో రెస్పాన్స్ వస్తుంటాయి. వీళ్ళ డాన్సులకి ఇక్కడి మ్యూజిక్ డైరెక్టర్లు కూడా న్యాయం చేయలేకపోతున్నారని బాలీవుడ్ నుండి మ్యూజిక్ డైరెక్టర్లని దింపారని అప్పట్లో కొందరు దర్శకులు అనేవారు. అయితే వీళ్ళని మించి చిరు తో డాన్స్ చేసే హీరోయిన్ ఒకడున్నారు. ఆమె ఎవరో కాదు, తన అభినయంతో ప్రేక్షకుల్ని కట్టిపడేసే భానుప్రియ.

- Advertisement -

చిరంజీవి భానుప్రియ కాంబినేషన్..
భానుప్రియ తో కూడా చిరంజీవి చాలా సినిమాలు చేసారు. ఇండస్ట్రీ కి కాస్త లేటుగా ఎంట్రీ ఇచ్చిన భానుప్రియ చిరు తో మంచి హిట్టు సినిమాలు చేసారు. క్లాసికల్ డాన్సర్ గా భానుప్రియకి పేరున్నప్పటికీ చిరంజీవితో కలిసి డిస్కో డాన్స్ లు, బ్రేక్ డాన్స్ లు చేసేవారు భానుప్రియ. అప్పటికి రాధ, విజయశాంతి వంటి వారితో రొటీన్ అనిపించేసిన ఫ్యాన్స్ కి భానుప్రియ డాన్స్ లతో ఏకంగా చిరంజీవికే పోటీనిచ్చే రేంజ్ లో డాన్స్ చేస్తుందని కితాబిచ్చేవారు. చిరంజీవి భానుప్రియ కాంబినేషన్స్ లో వచ్చిన చక్రవర్తి, జేబుదొంగ, ఖైదీ నెం 786, స్టేట్ రౌడీ లాంటి చిత్రాలు ఏ రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్లయ్యాయో తెలిసిందే. ఈ సినిమాలకి చిరంజీవి భానుప్రియ చేసిన డాన్సులు ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాయి.

చిరుతో అత్యధిక చిత్రాలు చేసిన ఈ ముగ్గురు..
ఇక మెగాస్టార్ చిరంజీవి తో రాధ 16, రాధిక 18, విజయ శాంతి 18 సినిమాలు చేసారంటే వీళ్ళ కాంబో లో ఎలాంటి పాటలు వచ్చాయో అర్ధం చేసుకోవచ్చు. వీళ్ళ తర్వాత చిరంజీవి భానుప్రియ తో 9 సినిమాలు చేసారు. సుమలత, మాధవి హీరోయిన్లతో 8 సినిమాలు చేసారు. ఇక ఆ తర్వాత వేరే హీరోయిన్లను ఎక్కువగా రిపీట్ చేయలేదు చిరు. 1992 తర్వాత మాత్రం చిరు కొత్త హీరోయిన్లకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆ తర్వాత కొందర్ని రిపీట్ చేసినా, 80స్ లో హీరోయిన్ల అంతగా ఎక్కువ సినిమాలు చేయలేదు. ఇక చిరంజీవితో హిట్ పెయిర్ అనిపించుకున్న ఆనాటి స్టార్ హీరోయిన్లలో రాధ సినిమాలకి ముగింపునిచ్చి ఫ్యామిలి లైఫ్ లో బిజీగా ఉండగా, విజయశాంతి పాలిటిక్స్ లో బిజీ గా ఉన్నారు. ఆ మధ్య సరిలేరు నీకెవ్వరూ లో రీ ఎంట్రీ ఇచ్చినా మళ్ళీ కొనసాగలేదు. ఇక రాధికా, భానుప్రియ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిసులు గా కొనసాగుతున్నారు.

Check out Filmify Telugu for Tollywood movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు