Samantha Love Story : చైతూ, సిద్దూ కంటే ముందు ఆ వ్యక్తిని సమంత ప్రేమించిందా..?

Samantha Love Story : తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ సమంత మొదట ఏం మాయ చేసావే అనే సినిమా ద్వారా తెలుగుతెరకు పరిచయమయ్యింది.. ఈ సినిమాతో ఈమె కెరియర్ మలుపు తిరిగింది.. దాదాపుగా కొన్నేళ్ల పాటు స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన సమంత ఎంతోమంది స్టార్ హీరోలకు జోడిగా నటించి లక్కీ హీరోయిన్గా కూడా పేరు సంపాదించింది. సమంత నటన, అందం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సమంత ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి టాలీవుడ్ లో తనకంటూ ఒక గుర్తింపుని సంపాదించుకుంది.

మరో వ్యక్తి తో ప్రేమాయణం..

అసలు విషయంలోకి వెళ్తే సమంత చదువుకునే రోజుల్లోనే ఒక ప్రముఖ పొలిటిషన్ కుమారుడు సమంతని పిచ్చిపిచ్చిగా ప్రేమించాడట. చివరికి ఈ విషయంలో సమంతను కూడా ఇబ్బంది పెట్టడంతో సమంత కూడా అతని ప్రేమను ఆక్సెప్ట్ చేసిందట. అలా కొద్ది రోజులకి సమంత కూడా ఓకే చెప్పిందని సమాచారం.

నెటిజన్స్ కామెంట్స్..

ఆ వెంటనే ఈమె ఇండస్ట్రీ లోకి రాగా.. కాస్త స్టార్ డం పెరగడంతో అతడిని వదిలేసినట్టు సమాచారం.. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు. కానీ ఈ విషయం తెలిసిన నెటిజన్లు సైతం నాగచైతన్య, సిద్ధార్థ్ ను మోసం చేసింది ఇందుకేనా అంటూ సమంత హేటర్స్ సైతం కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతున్నది.

- Advertisement -

చైతూ తో సమంత జీవితం..

అలా స్టార్ హీరోయిన్ గా ఎదుగుతున్న సమయంలో అక్కినేని హీరో నాగచైతన్యతో ప్రేమలో పడి పెద్దలను ఒప్పించి మరీ వివాహం చేసుకుంది. వీరి వివాహం ఎక్కువ కాలం నిలువ లేదు.. కొన్ని మనస్పర్ధలు కారణంగా సమంత , నాగచైతన్య విడిపోయారు.. ప్రస్తుతం ఎవరి లైఫ్ ను వారు బాగానే లీడ్ చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు..

సిద్ధార్థ్ తో సమంత ప్రేమాయణం..

కానీ సమంత ( Samantha Love Story ), నాగచైతన్య కంటే ముందు కోలీవుడ్ , టాలీవుడ్ హీరో అయిన సిద్ధార్థ్ తో ప్రేమాయణం నడిపిందని.. పెళ్లి కూడా చేసుకోవాలనుకుందని కానీ కొన్ని కారణాల చేత వీరిద్దరూ విడిపోయారనే రూమర్స్ కూడా వినిపించాయి.అంతేకాకుండా ఆ సమయంలో ఇద్దరు కలిసి ఒక గుళ్లో ప్రత్యేకంగా పూజను కూడా చేయించారు. అయితే ఇప్పుడు తాజాగా నాగచైతన్య, సిద్ధార్థ్ తో ప్రేమలో పడక ముందే మరొక వ్యక్తిని ప్రేమించిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి..

సమంత కెరియర్..

సమంత కెరియర్ విషయానికి వస్తే.. సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో నటించింది.. త్వరలోనే అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి సిద్ధం కాబోతోంది.. మరొకవైపు తాను అనుభవిస్తున్న మయోసైటిస్ అనే వ్యాధి నుంచి త్వరగా కోలుకోవడానికి పలు ప్రయత్నాలు చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.. ఏదేమైనా సమంత ప్రేమాయణం విషయాలు తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు