Lavanya Tripathi : హీరోయిన్ లావణ్య త్రిపాటికి అరుదైన వ్యాధి.. పాపం ఆ పని కూడా చేసుకోలేక పోతుందా?

Lavanya Tripathi : టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఉన్న క్రేజ్ అంతా కాదు. మెగా కుటుంబం నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోలు అడుగుపెట్టారు. చిరంజీవి వారసత్వాన్ని అందుపుచ్చుకొని ఇండస్ట్రీలో రాణిస్తున్నారు మెగా హీరోలు. అయితే మెగా హీరోలలో మెగా బ్రదర్ నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

మెగాస్టార్ బ్రాండ్తో ఇండస్ట్రీలు అడుగుపెట్టిన వరుణ్ తేజ్… ఫిదా సినిమాతో మంచి పాపులారిటీని తెచ్చుకున్నాడు. ఆ తర్వాత తొలిప్రేమ, గద్దల కొండ గణేష్ లాంటి బిగ్గెస్ట్ హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకున్నాడు వరుణ్ తేజ్. అయితే ఇటీవల హీరోయిన్ లావణ్య త్రిపాఠి మరియు వరుణ్ తేజ్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి జంటది ప్రేమ వివాహం.

గత మూడు నెలల కిందట వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి వివాహం చాలా గ్రాండ్గా జరిగింది. విదేశాలలోనే వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం హాలిడే లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు ఈ మెగా జంట. అయితే ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ హీరోయిన్ మెగా కోడలు లావణ్య త్రిపాటి గురించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. హీరోయిన్ లావణ్య త్రిపాటికి అలర్జీ విపరీతంగా ఉంటుందట.

- Advertisement -

తన చిన్నతనం నుంచి ఎలర్జీతో బాధపడుతుందట హీరోయిన్ లావణ్య త్రిపాటి (Lavanya Tripathi). అందుకే తన పెళ్లిలో జరిగిన హల్దీ ఫంక్షన్ లో కలర్స్ ఎక్కువగా తనకు పూయనీయ లేదట. ప్రకృతి సేద్యమైన కలర్స్ మాత్రమే.. తన హల్దీ ఫంక్షన్ లో వాడాలని ఆదేశాలు ఇచ్చిందట. దానికి తగ్గట్టుగానే లావణ్య త్రిపాఠి కుటుంబం ప్రకృతి సిద్ధమైన కలర్స్ మాత్రమే వాడారట. ఇప్పుడు ఇదే విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు