Varun Tej : ఈ నిర్మాత వల్లే మెగా ప్రిన్స్ కెరీర్ నాశనం అయిందా.?

Varun Tej : తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో ఉన్న యంగ్ హీరోస్ లో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) ఒకరు. ముకుంద సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు వరుణ్ తేజ్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక మంచి హీరో దొరికాడు అనే ఫీలింగ్ కూడా కలిగింది. ఆ తర్వాత అందరు హీరోల్లా కాకుండా డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలను ఎంచుకుంటూ కెరియర్ లో ముందుకెళ్లాడు వరుణ్ తేజ్.

వరుణ్ తేజ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద కొన్ని డిజాస్టర్ లు కూడా ఉన్నాయి. అయితే ఆ సినిమా డిజాస్టర్ వలన వరుణ్ తేజ్ కెరీర్ కి పెద్దగా నష్టం కలగలేదు. కానీ వరుణ్ తేజ్ మార్కెట్ మాత్రం నష్టపోయిందని చెప్పొచ్చు. వరుణ్ తేజ్(Varun Tej) మాత్రం అవకాశాలు వస్తూనే ఉన్నాయి. ఇకపోతే వరుణ్ తేజ్ కెరియర్ లో కూడా మంచి హిట్ సినిమాలు ఉన్నాయి. ఫిదా, కంచె, గద్దల కొండ గణేష్ వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాలు అయ్యాయి.

ఇకపోతే రీసెంట్ టైమ్స్ లో వరుణ్ తేజ్ హిట్ సినిమా చూసి చాలా ఏళ్లయింది అని చెప్పొచ్చు. రీసెంట్ టైమ్స్ లో వరుణ్ తేజ్ చేస్తున్న ప్రతి సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ప్రేక్షకులను నిరాశకు గురిచేస్తుంది. అయితే దీని గురించి వరుణ్ తేజ్ కూడా మాట్లాడుతూ వచ్చాడు. నేను చేస్తున్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిల్ అయినా కూడా నేను కంటెంట్ బేస్డ్ సినిమాలు చేస్తూనే ఉంటాను. అవసరమైతే నా రెమ్యూనరేషన్ కూడా వదిలేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు.

- Advertisement -

ఇక వరుణ్ తేజ్ ప్రస్తుతం కరుణకుమార్ దర్శకత్వంలో మట్కా అనే సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా లో వరుణ్ తేజ్(Varun Tej) మొత్తం మూడు గెటప్ లలో కనిపించనున్నాడు. అయితే ప్రస్తుతం ఈ సినిమా హోల్డ్ లో పడింది అని వార్తలు వినిపిస్తున్నాయి.

ఇకపోతే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొంతమంది హీరోలకు డేట్స్ చూడడం విషయంలోనూ, కథల విషయంలోనూ కొందరు ఇన్వాల్వ్ అయి ఉంటారు. చాలామంది హీరోలను అప్రోచ్ అవ్వాలంటే ముందుగా కథను చాలామందికి నేరెట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ప్రాసెస్లో సరైన జడ్జిమెంట్ ను తెలుసుకున్న వాళ్ళు ఆ కథను హీరో వరకు చేరుస్తారు. ఆ జడ్జ్మెంట్ లేకపోతే ఆ సినిమా రిజెక్ట్ అవుతుంది.

ఇకపోతే రీసెంట్ గా వరుణ్ తేజ్ ఘని, ఆపరేషన్ వాలైంటెన్ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు “సిద్ధు ముత్త”. వరుణ్ తేజ్ చేసిన ఘాండివ ధారి అర్జునా, ప్రస్తుతం చేస్తున్న మట్కా సినిమాల విషయంలో కూడా కీలకపాత్రను పోషించాడు. అయితే రిలీజ్ అయిన ఈ మూడు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద సరైన విజయాన్ని అందుకోలేదు. ఇప్పుడు మట్కా హోల్డ్ లో పడింది.

వాస్తవానికి వరుణ్ తేజ్ సినిమాలు హిట్ అయినా ఆయనకు క్రెడిట్ రావడం లేదు. ఇప్పుడు వరుణ్ తేజ్ కజిన్ సిద్ధు ముత్త నిర్మాతగా వచ్చిన రెండు సినిమాలు డిజాస్టార్. అన్ని తానై చూసుకున్న ఘాండివ ధారి అర్జున కూడా డిజాస్టార్. ఇప్పుడు మట్కా పై కూడా ఎన్నో అనుమానాలు వస్తున్నాయి. వరుణ్ తేజ్ చేసే ప్రాజెక్ట్ లు అన్ని సిద్ధు ముత్త ఒకే చేస్తేనే అవుతున్నాయి. సిద్ధు ముత్త మాటలు తప్పా ఎవరి మాటలు వినిడం లేదు వరుణ్ అని ఫిలింనగర్ సర్కిల్స్ లో వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు