GV Prakash : బ్యాక్ టు బ్యాక్ సెట్ చేసాడు

GV Prakash : జీవి ప్రకాష్ కుమార్ ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించాడు జీవీ ప్రకాష్. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ కి జీవి ప్రకాష్(GV Prakash) మేనల్లుడు అనే విషయం మనకు తెలిసిందే. అయితే జీవి ఇప్పటివరకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందించాడు. తెలుగులో కూడా జీవి ప్రకాష్(GV Prakash) చేసిన ఎన్నో ఆల్బమ్స్ ఘన విజయాన్ని సాధించాయి.

ముందుగా ఏఆర్ రెహమాన్ దగ్గర కొన్ని సినిమాలకు పనిచేసిన జీవి ప్రకాష్ కుమార్, ఆ తర్వాత హరీష్ జయరాజ్ దగ్గర కొన్ని సినిమాలుకు వర్క్ చేశాడు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన అపరిచితుడు సినిమాలో రెండు పాటలను కూడా పాడాడు జీవి ప్రకాష్ కుమార్. జీవి ప్రకాష్ కుమార్ తమిళ్లో చేసిన మద్రాస్ పట్నం సాంగ్స్ ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత సెల్వరాఘవన్ దర్శకత్వంలో వచ్చిన మయక్కం ఎన్న సినిమా జీవి ప్రకాష్ కి మంచి గుర్తింపుని తీసుకొచ్చి పెట్టింది.

ఇకపోతే కేవలం సంగీత దర్శకుడుగానే కాకుండా నటుడుగా కూడా మంచి గుర్తింపును సాధించుకున్నాడు జీవి ప్రకాష్. యాక్టింగ్ స్కూల్లో కూడా శిక్షణ తీసుకున్నాడు జీవి. అయితే జీవి ప్రకాష్ కుమార్ చేసిన చాలా సినిమాలు కూడా మంచి విజయాన్ని సాధించాయి. రీసెంట్ గా వచ్చిన బ్యాచిలర్ సినిమా అయితే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

- Advertisement -

ప్రస్తుతం తెలుగులో చాలా పెద్ద ప్రాజెక్టుకి జీవీ ప్రకాష్(GV Prakash) సంగీతం అందిస్తున్నాడు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన సార్ సినిమాకి అద్భుతమైన సంగీతాన్ని సమకూర్చాడు జీవీ ప్రకాష్. ప్రస్తుతం వెంకీ అట్లూరి దుల్కర్ సల్మాన్తో చేస్తున్న సినిమా కూడా జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. వీటితోపాటు చాలా ప్రాజెక్టులను డీల్ చేస్తున్నాడు జీవి. ఇక కేవలం సంగీత దర్శకుడుగానే కాకుండా మరోవైపునట్టుగా కూడా ఫుల్ బిజీ అయిపోయాడు ప్రకాష్.

ప్రస్తుతం జీవి ప్రకాష్ నాలుగు సినిమాలతో సిద్ధంగా ఉన్నాడని చెప్పొచ్చు. జీవి ప్రకాష్ కుమార్ నటిస్తున్న రెబల్ సినిమా ప్రస్తుతం థియేటర్లో విజయవంతంగా కొనసాగుతుంది. ఇకపోతే ఏప్రిల్ 4న కల్వన్ అనే సినిమా రిలీజ్ కాబోతుంది. మళ్లీ ఇదే నెలలో 11వ తారీఖున డియర్ అనే సినిమా రిలీజ్ కానుంది. ఒకే నెలలో ఒకే హీరో సినిమాలు రెండు రిలీజ్ అవ్వడం అనేది అరుదుగా జరిగే విషయం. అలానే జీవి ప్రకాష్ నటిస్తున్న ఇంకో సినిమా కింగ్ స్టోన్ సమ్మర్ లో రిలీజ్ కానుంది.

ఒకవైపు సూపర్ హిట్ సినిమాలకు సంగీతం అందిస్తూ మరోవైపు యాక్టర్ గా కూడా బిజీ అయిపోయాడు జీవి. జీవి మ్యూజిక్ డిఫరెంట్ గా ఉంటుందని చెప్పొచ్చు. చాలామంది శ్రోతలను ఆకట్టుకొనే కంపోజిషన్ చేయడంలో జీవి కూడా ముందుంటాడు. అద్భుతమైన సాంగ్స్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో కూడా ప్రేక్షకులకు గూస్ బమ్స్ తెప్పిస్తాడు అని చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు