Siva : బాలీవుడ్ ఎంట్రీ కి సిద్ధం

Siva : దర్శకుడు శివ(Siva) అంటే అందరికీ తెలియకపోవచ్చు. కానీ సిరూతై శివ అంటే చాలామంది సినిమా ప్రేమికులకు తెలుస్తుంది. ఎందుకంటే ఆ సినిమాతోనే కోలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు శివ. శివ(Siva) నిర్మాతగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇద్దామనుకున్నాడు. కానీ సినిమాటోగ్రాఫర్ గా ఎంట్రీ ఇచ్చాడు. అడయార్ ఫిలిం ఇనిస్టిట్యూట్ లో గోల్డ్ మెడల్ కూడా సాధించుకున్నాడు . ప్రముఖ సినిమాటోగ్రాఫర్ “జయన్ విన్సెంట్” దగ్గర కొంతకాలం పనిచేసాడు.

దగ్గుబాటి వెంకటేష్ నటించిన సినిమా జయం మనదేరా సినిమాకి ఆపరేటివ్ కెమేరామన్ గా పనిచేసిన శివ, ఆ తర్వాత తను సినిమాటోగ్రాఫర్ గా మారి కొన్ని సినిమాలకు పనిచేసే మంచి గుర్తింపు సాధించుకున్నాడు. తెలుగులో విఎన్ఆర్ ఇచ్చే దర్శకత్వం వహించిన మూడు సినిమాలకు శివ సినిమాటోగ్రఫీ చేశాడు.
2008లో దర్శకుడుగా మారాడు శివ. గోపీచంద్, అనుష్క శెట్టి నటించిన శౌర్యం సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా ఊహించిన విజయాన్ని అందుకోలేదు.

ఆ తర్వాత మళ్లీ గోపీచంద్ శంఖం అనే సినిమాను తెరకెక్కించాడు.
2011లో శివ తమిళ సినిమా రంగంలో సిరుతై చిత్రంలో దర్శకునిగా ఎంట్రీ ఇచ్చాడు . తెలుగులో ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహించిన విక్రమార్కుడు సినిమాకి రీమేక్ ఇది. ఈ సినిమాలో కార్తీ మెయిన్ లీడ్ గా నటించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించింది. అక్కడితో ఆయన “సిరుతై శివ”గా మారిపోయారు. ఆ తర్వాత మళ్లీ తెలుగులో దరువు అనే సినిమాను చేశాడు శివ. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అయింది.

- Advertisement -

ఇకపోతే తెలుగులో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన శివ తమిళ్లో బాగా పాపులర్ అని చెప్పొచ్చు. దీని కారణం అజిత్ లాంటి స్టార్ హీరోతో అద్భుతమైన సూపర్ హిట్ సినిమాలను చేశాడు శివ. దాదాపు అజిత్ తో చేసిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించాయి. శివ చేసిన వీరం వేదాళం సినిమాలను తెలుగులో కూడా రీమేక్ చేశారు. అయితే ఈ రీమిక్స్ సినిమాలు తెలుగులో ఊహించిన స్థాయిలో ఆడలేదు.

ఇకపోతే ప్రస్తుతం శివ కంగువ అనే ఒక సినిమాను చేస్తున్నాడు. సూర్య నటిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది. ఇదివరకే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన వీడియో కంటెంట్ కూడా సినిమా పైన హై ఎక్స్పెక్టేషన్స్ని పెంచుతుంది. ఈ సినిమా తర్వాత శివ బాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. శివ చేయబోయే బాలీవుడ్ సినిమాలో రణబీర్ కపూర్, వరుణ్ ధావన్ కలిసి నటిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమాను ఒక పెద్ద ప్రొడక్షన్స్ నిర్మించబోతున్నట్లు విశ్వసినీ వర్గాల సమాచారం. బాలీవుడ్ లో సినిమా తర్వాత అజిత్ తో మళ్ళీ సినిమాను చేయనున్నాడు శివ. ఆ తర్వాత కంగువ సినిమాకు సీక్వెల్ సిద్ధం చేయనున్నట్లు తెలుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు