Shankar : రెండు సినిమాలు పూర్తి చేసేసాడు

Shankar : ఇండియన్ జేమ్స్ కామెరాన్ శంకర్(Shankar) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తమిళ్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను తీసిన శంకర్ తెలుగులో కూడా అంతే పాపులర్ శంకర్(Shankar) చేసిన చాలా సినిమాలు తెలుగులోకి అనువాదమయ్యాయి అందుకే తెలుగులో కూడా శంకర్ కి ఒక సెపరేట్ ఫ్యాన్ వేసి ఉంది అని చెప్పొచ్చు. ప్రస్తుతం అంతా పాన్ ఇండియా పాన్ ఇండియా అంటున్నారు కానీ ఒకప్పుడు శంకర్ చేసే కాన్సెప్ట్ లు కూడా ప్లాన్ ఇండియా లెవెల్ లో ఉండేవి.

అయితే శంకర్ నుంచి చివరగా వచ్చిన చిత్రం రోబో 2 ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని అందుకోలేదు. అయితే రజనీకాంత్ తో చేసిన రోబో సినిమా అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించింది. ఆ సినిమాకి సీక్వెల్ గా వస్తుండడంతో ఈ సినిమా పైన భారీ అంచనాలు పెరిగాయి కానీ అంచనాలను ఆ సినిమా అందుకోలేకపోయింది. ఇకపోతే ప్రస్తుతం శంకర్ రామ్ చరణ్ తేజ్ తో గేమ్ చేంజర్ అనే సినిమాను చేస్తున్నాడు. దీంతోపాటు ఇండియన్ 2 సినిమాను చేస్తున్న సంగతి కూడా మనకు తెలిసిందే.

కమల్ హాసన్ నటించిన ఇండియన్ సినిమా తెలుగులో భారతీయుడుగా విడుదలైంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించింది. ఇప్పటికీ భారతీయుడు సినిమా వచ్చిన ప్రతిసారి చాలామంది టీవీలు అతుక్కుపోతారని చెప్పొచ్చు. అంత పెద్ద హిట్ అయింది భారతీయుడు సినిమా. ఆ సినిమాకి సీక్వెల్ చేస్తున్నట్లు ఎప్పుడూ అనౌన్స్ చేసి మొదలుపెట్టారు శంకర్.

- Advertisement -

అయితే ఇండియన్ 2 సినిమాకి వచ్చిన అవాంతరాలు అన్ని ఇన్ని కాదు. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఏదో ఒక అడ్డు వస్తూనే ఉంది. ఒక సందర్భంలో సెట్ కూడా కాలిపోవడం. ఈ సినిమా జరిగే ప్రాసెస్లో ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా చనిపోయారు. దాదాపు ఈ ప్రాజెక్టు ఆగిపోతుంది అని చాలామంది అనుకున్నారు. కానీ ఎట్టకేలకు ఈ ప్రాజెక్టు షూటింగ్ పూర్తి చేసి రిలీజ్ కి సిద్ధం చేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం ఇండియన్ 2 సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఇండియన్ 2 సినిమా తో పాటు ఇండియన్ 3 కూడా శంకర్ పూర్తి చేశాడట. ఇండియన్ 2 సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయిన తర్వాత ఇండియన్ 3 సినిమా పోస్ట్ ప్రొడక్షన్ ను స్టార్ట్ చేయనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా కమల్ హాసన్ చెప్పుకొచ్చారు.

ఇకపోతే విక్రమ్ సినిమాతో అద్భుతమైన ఘనవిజయాన్ని అందుకున్నాడు కమల్ హాసన్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా మంచి హిట్ అయింది. ఈ సినిమా తర్వాత లోకేష్ కనకరాజ్ కి చాలామంది అభిమానులు పుట్టుకొచ్చారు. హిట్ లేక సతమతం అవుతున్న కమల్ హాసన్ కి ఒక గ్రేట్ కం బ్యాక్ ఫిలిం విక్రమ్.

ఇకపోతే ప్రస్తుతం కమల్ హాసన్ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ఇండియన్ సినిమా సీక్వెల్స్ తో పాటు, ప్రభాస్ నటిస్తున్న కల్కి సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఈ కల్కి సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ఎదురుచూస్తున్నారు. అలానే మణిరత్నం దర్శకత్వంలో థగ్ లైఫ్ అనే సినిమాను చేస్తున్నారు కమల్ హాసన్. ఈ సినిమా ఎలక్షన్ క్యాంపెయిన్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అవుతుంది అని రీసెంట్ గా ఒక ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పకు వచ్చారు కమల్ హాసన్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు