Matka : అమెజాన్ ప్రైమ్ అనౌన్స్మెంట్ తో వరుణ్ కు కొత్త చిక్కులు

రీసెంట్ గా ఆపరేషన్ వాలెంటైన్ మూవీతో మరో డిజాస్టర్ ను అందుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం నెక్స్ట్ మూవీపై కాన్సన్ట్రేషన్ చేశారు. పలాస ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో “మట్కా” అనే టైటిల్ తో మరో పాన్ ఇండియా ప్రయత్నానికి సిద్ధమవుతున్నారు. ఏ ముహూర్తాన ఈ సినిమాను ప్రకటించారో తెలియదు కానీ, అనౌన్స్ చేసినప్పటి నుంచే ఏదో ఒక సమస్య వచ్చి పడుతూ ఉంది. అమెజాన్ ప్రైమ్ చేసిన తాజా వెబ్ సిరీస్ అనౌన్స్మెంట్ తో వరుణ్ కు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఆ వెబ్ సిరీస్ కు, మట్కా మూవీకి సంబంధం ఏంటి? దానివల్ల మట్కా టీంకు సమస్య ఏంటి? అనే వివరాల్లోకి వెళితే…

ఇద్దరి టార్గెట్ ఒక్కటేనా?
వరుణ్ తేజ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తీస్తున్న మూవీ మట్కా. 60 నుంచి 80 వ దశకం మధ్యలో భారతదేశంలో మట్కా అనే జూద క్రీడను తీసుకొచ్చి లక్షలాది మంది జీవితాలను అతలాకుతలం చేశాడు రతన్ ఖాత్రి అనే వ్యక్తి. అతని జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకునే వరుణ్ తేజ్ తో మట్కా మూవీని డైరెక్టర్ కరుణ కుమార్ తెరకెక్కిస్తున్నారు. మేకర్స్ ఈ విషయాన్ని నోరు విప్పి చెప్పకపోయినా స్టోరీ లైన్ గమనిస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ఈ మూవీ కోసం ఇప్పటికే వరుణ్ బరువు పెరగడం, తగ్గడం లాంటివి చేయడానికి చాలా కష్టపడ్డాడు. అలాగే ఈ మూవీలో ఆయన మూడు నాలుగు డిఫరెంట్ గెటప్స్ లో కనిపించబోతున్నట్టుగా టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే అమెజాన్ ప్రైమ్ తాజాగా మట్కా కింగ్ అనే వెబ్ సిరీస్ ని అనౌన్స్ చేసి వరుణ్ టీం కు షాక్ ఇచ్చింది. అసలు ఈ మట్కా కింగ్ స్టోరీ ఏంటి అనే విషయాన్ని అమెజాన్ ప్రకటించలేదు. కానీ టైటిల్ చూస్తే ఈ రెండు సినిమాలు రతన్ ఖాత్రి స్టోరీ తోనే రూపొందుతున్నట్టుగా అనిపిస్తోంది. అమెజాన్ ప్రకటించిన మట్కా కింగ్ వెబ్ సిరీస్ కు మరాఠీలో సైరత్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీని రూపొందించిన నాగరాజ్ మంజులే దశకత్వం వహించబోతున్నారు. క్యాస్టింగ్ కు సంబంధించిన డీటెయిల్స్ ఇంకా అనౌన్స్ చేయలేదు. సాధారణంగానే అమెజాన్ తమ సినిమాలు, సిరీస్ లు సెట్స్ మీద ఉన్నప్పుడు ఎలాంటి అప్డేట్స్ ఇవ్వరు. రిలీజ్ డేట్ తర్వాతే ఏదైనా బయటకు వస్తుంది. ఒకవేళ వరుణ్ మట్కా, అమెజాన్ ప్రైమ్ మట్కా కింగ్ రెండు స్టోరీలు ఒకటే అయితే… పోలికల పరంగా వరుణ్ టీం కొత్త సమస్యలను ఎదుర్కొక తప్పదు.

కష్టకాలం నుంచి గట్టెక్కుతారా?
ఇక మట్కా మూవీ విషయానికొస్తే… ఇది డైరెక్టర్, హీరో ఇద్దరికీ చాలా ముఖ్యమైన మూవీ. గత కొంతకాలంగా వరుస డిజాస్టర్లు అందుకుంటున్న వీరిద్దరూ ఎలాగైనా ఈసారి హిట్ కొట్టాలనే పట్టుదలతో బాగానే కష్టపడుతున్నారు. కానీ ఆ కష్టానికి అడుగడుగునా ఏదో ఒక రకంగా పరీక్ష ఎదురవుతూనే ఉంది. నిన్న మొన్నటిదాకా ఈ మూవీకి బడ్జెట్ సమస్యలు వచ్చాయని, ఆగిపోయింది అనే వార్తలు వైరల్ అయ్యాయి. ఆ తర్వాత బడ్జెట్ సమస్యల నుంచి కోలుకుని ఎట్టకేలకు షూటింగ్ మొదలు పెడితే ఇప్పుడేమో అమెజాన్ కొత్త వెబ్ సిరీస్ ప్రకటించి షాక్ ఇచ్చింది. మరి వరుణ్ మట్కా ముందు రిలీజ్ అవుతుందా? లేదంటే అమెజాన్ మట్కా కింగ్ ను ముందు మార్కెట్లోకి దింపుతుందా? అనే దానిపైనే వీళ్లకు ఎలాంటి సమస్యలు ఎదురవ్వబోతున్నాయి అనేది ఆధారపడి ఉంటుంది.

- Advertisement -

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు