Varun tej : ఆపరేషన్ వాలెంటైన్ డే 1 లెక్క.. ఇది ఊహించలేదు!

మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ఆపరేషన్ వాలెంటైన్ ఫైనల్ గా మార్చి 1న రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా టాలీవుడ్ ప్రేక్షకుల నుండి ఆశించినంత రెస్పాన్స్ రాబట్టుకోలేకపోయిపోయింది. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 2019 పుల్వామా దాడుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా, స్టోరీ నేపథ్యం బాగానే ఉన్నా, స్క్రీన్ ప్లే పరంగా నిరాశపరిచింది. రీసెంట్ టైంలో వరుసగా నిరాశ పరిచే రిజల్ట్ లనే సొంతం చేసుకుంటున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కనీసం ఈ సినిమాతో అయినా ప్రేక్షకుల్ని మెప్పిస్తాడు అని ట్రేడ్ విశ్లేషకులు భావించారు. కానీ అలా జరగలేదు సరికదా, ఓపెనింగ్స్ పరంగా కూడా చాలా దారుణంగా వచ్చాయి.

తెలుగు రాష్ట్రాల ఓపెనింగ్స్..
వరుణ్ తేజ్ నటించిన ఆపరేషన్ వాలెంటైన్ నెగిటివ్ ఇంపాక్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర క్లియర్ గా కనిపించగా, ఫస్ట్ డే ఓపెనింగ్స్ పరంగా చాలా నిరాశ పరిచి మైండ్ బ్లాంక్ చేసింది. మొదటి రోజు 2 కోట్ల దాకా గ్రాస్ వసూలు చేస్తుందని గెస్ చేస్తే, ఓవరాల్ గా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో 1.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూళ్ళని సినిమా సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల జనాలు లేక డెఫిసిట్ లు కూడా పడ్డాయి. అందుకే ఏరియాల వారీగా కలెక్షన్ల లెక్కలు కూడా ఇంకా బయటికి రాలేదు. అయితే ఓవరాల్ గా షేర్ అటూ ఇటూగా తెలుగు రాష్ట్రాల్లో 80 లక్షల రేంజ్ లో ఉంటుంది. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం25 లక్షల రేంజ్ లోనే గ్రాస్ ను అందుకోగా ఓవర్సీస్ లో 30 లక్షల రేంజ్ లో కలెక్షన్లు వచ్చాయి.

టార్గెట్ లో పది శాతం అయినా?

- Advertisement -

తెలుగురాష్ట్రాల్లో ఫస్ట్ షో నుండే నెగిటివ్ స్ప్రెడ్ చేయడంతో ఆపరేషన్ వాలెంటైన్ మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 1.05 కోట్ల రేంజ్ లో షేర్ ఈ సినిమా సొంతం చేసుకుంది. అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర వరుణ్ తేజ్ సినిమా వాల్యూ బిజినెస్ రేంజ్ 17 కోట్ల దాకా ఉండగా సినిమా 18 కోట్ల రేంజ్ లో బ్రేక్ ఈవెన్ తో రిలీజ్ అయింది. కానీ రిలీజ్ అయిన ఫస్ట్ డే అందులో 10 శాతం వసూలని కూడా అందుకోలేకపోయింది. వరల్డ్ వైడ్ గా కనీసం రెండు కోట్లయినా వసూలు చేయాల్సింది ఈ సినిమా. ఇక ఈ సినిమా మొదటి రోజే మైండ్ బ్లాంక్ చేసే ఓపెనింగ్స్ ను సొంతం చేసుకోగా క్లీన్ హిట్ అవ్వాలి అంటే మరో 17 కోట్ల వరకైనా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంది. అయితే సినిమాకి వచ్చిన టాక్ ఇంకా ఓపెనింగ్స్ ని బట్టి చూస్తే సినిమా ఎక్కడికెళ్తుందో కూడా తెలియట్లేదు. మరి ఈ సినిమా వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమైనా గ్రోత్ ని చూపిస్తుందో లేదో చూడాలి.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు