Operation Valentine : ఇదసలు ఊహించలేదు భయ్యా… డైరెక్టర్ ను నమ్మి వరుణ్ తప్పు చేశాడా?

ఎలాగైనా ఈసారి హిట్ అందుకోవాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజా చిత్రం “ఆపరేషన్ వాలెంటైన్”తో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. కానీ సినిమా చూసిన తర్వాత ఆ బాలీవుడ్ డైరెక్టర్ ను నమ్మి వరుణ్ తప్పు చేశాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి ఇంతకీ సినిమా ఎలా ఉంది? డైరెక్టర్ పై ఇలాంటి అభిప్రాయం రావడానికి కారణం ఏంటి? అనే వివరాల్లోకి వెళితే…

కొత్త కథ కాదు…
ముందుగా కాన్సెప్ట్ గురించి మాట్లాడుకోవాలి. పుల్వామా దాడులు, సర్జికల్ స్ట్రైక్స్ వంటి అంశాలతో గతంలో “యురి : ది సర్జికల్ స్ట్రైక్” అనే మూవీ రావడం, బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం అందరికీ తెలిసిన కథే. ఈ మూవీ ఏకంగా బాక్స్ ఆఫీస్ వద్ద 200 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి, హీరో విక్కీ కౌశల్ కెరీర్ ను మార్చేసింది. అలాగే ఓటీటీలో కూడా ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక రీసెంట్ గా అంటే 2024 జనవరి 25న రిలీజ్ అయిన హృతిక్ రోషన్, దీపికా పదుకొనె జంటగా నటించిన మరో మూవీ “ఫైటర్” కూడా అదే కాన్సెప్ట్. అయితే ఈ మూవీకి హిందీలో పెద్దగా పోటీ లేవకపోవడంతో అక్కడ పర్వాలేదు అనిపించింది. కానీ తెలుగులో మాత్రం కనీసం ఆ మూవీ రిలీజ్ అయింది అన్న విషయం కూడా ఎవరికీ తెలీదు. మరి ఇలాంటి సమయంలో ఆపరేషన్ వాలెంటైన్ మూవీని రిలీజ్ చేయడం వల్ల ఉపయోగం ఏంటి అనేది చిత్ర బృందానికే తెలియాలి.

డైరెక్టర్ టార్గెట్ వేరు…
వరుణ్ తేజ్ కి కాస్త కూస్తో మార్కెట్ ఉన్నది టాలీవుడ్ లోనే. కాబట్టి ముందుగా ఇక్కడ స్ట్రాంగ్ ప్రమోషన్స్ చేసి ఆ తర్వాత హిందిపై ఫోకస్ చేయాలి. “ఆపరేషన్ వాలెంటైన్” మూవీ ప్రమోషన్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి వినిపిస్తున్న మాట ఇదే. అయితే పాన్ ఇండియా స్టార్ గా ఎంట్రీ ఇవ్వాలని డిసైడ్ అయిన వరుణ్ ఇక్కడ ప్రమోషన్స్ పరంగా చిరంజీవి హెల్ప్ తో సరిపెట్టేసి, నార్త్ పైన ఎక్కువగా ఫోకస్ చేశాడు. అయితే ఇంత కష్టపడినప్పటికీ డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్ హడా… వరుణ్ ను చీట్ చేశాడా అనిపిస్తుంది. దానికి కారణం ఇప్పటికే బాలీవుడ్ ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతున్న కాన్సెప్ట్ ను డైరెక్టర్ ఎంచుకోవడం మాత్రమే కాకుండా, ఆయన టార్గెట్ మొత్తం బాలీవుడ్ పైనే ఉంది.

- Advertisement -

కనీసం ఆయన తెలుగు ఆడియన్స్ మూవీని ఎలా ఆదరిస్తారు అనే విషయాన్ని పట్టించుకోలేదు. సాధారణంగానే తెలుగు వాళ్లకు ఇలాంటి సినిమాలు పెద్దగా నచ్చవు. కనీసం కథ అయినా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందేమో అనుకుంటే… టీం బిగ్ ఎస్సెట్ గా భావించిన ఎమోషన్స్, దేశభక్తి పరంగా ఆడియన్స్ సినిమాకు కనెక్ట్ అవ్వడం కష్టం. విజువల్స్ కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. సినిమాలో హై మూమెంట్స్ కి స్కోప్ ఉన్నప్పటికీ దర్శకుడు వాటిని హైలెట్ చేసే ప్రయత్నం చేయలేదు. స్క్రీన్ ప్లే పరంగా మ్యాజిక్ క్రియేట్ చెయ్యలేకపోయాడు. ఆయన కేవలం నార్త్ ఆడియన్స్ ను మాత్రమే ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేయడం ఇక్కడ గమనించాల్సిన విషయం. కనీసం వరుణ్ తో సహా నటీనటులను సరిగ్గా వాడుకోలేకపోయాడు.

మొత్తానికి ఈ నార్త్ డైరెక్టర్ ను నమ్ముకుని వరుణ్ తప్పు చేశాడా? అన్న ఫీలింగ్ కలగకమానదు. “ఆపరేషన్ వాలెంటైన్” మూవీతో వరుణ్ చేసిన ప్రయత్నం, దాని కోసం ఆయన పడ్డ కష్టాన్ని ఈ డైరెక్టర్ నీరుగార్చేశాడు. ఎందుకంటే ఈ సినిమాకు అతి పెద్ద మైనస్ పాయింట్స్ లో డైరెక్టర్ కూడా ఒకరు. మరి ఈ మూవీతోనైనా వరుణ్ ఖాతాలో హిట్ పడిందా? అంటే డౌటే. మొత్తానికి దర్శకుడిని నమ్మి వరుణ్ మోసపోయినట్టుగా అయ్యింది.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు