Allu Arjun Sneha Reddy : క్యూట్ కపుల్ మధ్య విభేదాలా..?

Allu Arjun Sneha Reddy : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ క్రేజీ కపుల్స్ గా గుర్తింపు తెచ్చుకున్న జంటలలో అల్లు అర్జున్ – అల్లు స్నేహారెడ్డి( Allu Arjun Sneha Reddy ) దంపతులు కూడా ఒకరు అని చెప్పవచ్చు.. వీరు వ్యక్తిగతంగా ఎంత రొమాంటిక్ గా ఉంటారో సోషల్ మీడియా వేదికగా అంతే రొమాంటిక్గా ఉంటూ.. తమకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ అభిమానులకు చేరువలో ఉంటారు.. అయితే ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట మధ్య తాజాగా విభేదాలు తలెత్తాయి అనే వార్త నెట్టింట వైరల్ గా మారింది. ఈ విషయం తెలిసి అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు.

అల్లు అర్జున్ – స్నేహ రెడ్డి మధ్య విభేదాలు..

టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ పాపులారిటీ దక్కించుకున్న అల్లు అర్జున్ ఆయన భార్య స్నేహారెడ్డి మధ్య విభేదాలు రావడానికి గల కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం.. స్టార్ హీరో అల్లు అర్జున్ అలాగే స్నేహ రెడ్డిలది ప్రేమ వివాహం.. వీరిద్దరూ ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి మరి గ్రాండ్ గా వివాహం చేసుకున్నారు.. ఈ జంటకి అయాన్ , అర్హ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే పెళ్లయి ఎన్ని సంవత్సరాలు అయినా చాలా అన్యోన్యంగా ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్న ఈ జంట మధ్య ఇప్పుడు విభేదాలు వస్తున్నాయి అంటూ కొన్ని వార్తలు సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్నాయి.. దీంతో అభిమానులు సైతం అయోమయంలో పడ్డారు.. ఇక వీరిద్దరి మధ్య విభేదాలు నిజంగానే వచ్చాయా ? ఒకవేళ వస్తే అందుకు గల కారణం ఏమిటి? లేక ఎవరైనా వీటిని అసత్య ప్రచారాలు చేయడం మొదలు పెట్టారా? అనే కోణంలో అభిమానులు సైతం ఆరాధిస్తున్నారు..

విభేదాలపై క్లారిటీ..

అల్లు అర్జున్ – స్నేహ రెడ్డి( Allu Arjun Sneha Reddy )మధ్య విభేదాలు అంటూ వచ్చిన విషయం వాస్తవమే.. కానీ అవి విడాకులు తీసుకునే అంత సీరియస్ వి కావు. భార్యాభర్తల మధ్య ఉండే చిలిపి తగాదాలు సర్వ సాధారణం… సాధారణంగా భార్యాభర్తలు అన్న తర్వాత చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయి.. ఇప్పుడు వీరిద్దరి మధ్యలో కూడా ఇలాంటి గొడవలే జరిగాయట ..అవి కూడా పిల్లల విషయంలో ..స్నేహ రెడ్డి తన పిల్లలు ఇద్దరినీ ఇండిపెండెంట్గా ఉండేలా వారి కాళ్లపై వాళ్లు బ్రతికేలా చూసుకుంటున్నట్లు తెలుస్తోంది.. కానీ అల్లు అర్జున్ మాత్రం తమ పిల్లల్ని చాలా గారాబం చేస్తారట.. వారికి చిన్న దెబ్బ తగిలినా తట్టుకోలేక ఎమోషనల్ అవుతున్నట్లు సమాచారం..

- Advertisement -

ఈ విషయంలోనే తరచూ అల్లు అర్జున్ ని తిడుతూ పిల్లల్ని గారాబం చేస్తే పెద్దయ్యాక చెడిపోతారంటూ ఆమె బన్నీతో వాదనకు దిగినట్లు సమాచారం.. ఇక దీనివల్లే వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయనే వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.. ఏదేమైనా పిల్లల విషయంలో భార్యాభర్త ఇద్దరు బాధ్యతగా ప్రవర్తిస్తేనే వారు ప్రయోజకులవుతారనటంలో సందేహం లేదు అంటూ అభిమానులు సైతం కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా అల్లు స్నేహ తీసుకుని నిర్ణయం సరైనదే అని ఆమెకు మద్దతు పలుకుతున్నారు బన్నీ ఫ్యాన్స్.. మరి కొంతమంది ఏమో తండ్రి గారాబం మేడం అంటూ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు