Prithviraj Sukumaran : రెమ్యూనరేషన్ పై పృథ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు..!!

Prithviraj Sukumaran : మలయాళం లో స్టార్ హీరోగా మంచి పాపులారిటీ సంపాదించుకున్న నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran) ..ఎప్పుడూ కూడా సరికొత్త కథలతో ప్రేక్షకులను మెప్పిస్తూనే ఉంటారు.. మలయాళంలో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన హీరోగా పేరు సంపాదించారు. కేవలం మలయాళం లోనే కాకుండా ఇతర భాషలలో కూడా నటిస్తున్నారు పృథ్వీరాజ్ సుకుమారన్(Prithviraj Sukumaran). ఇటీవలే ప్రభాస్ నటించిన సలార్ సినిమాలో కూడా రెండు క్యారెక్టర్ లలో నటించారు.. త్వరలోనే తాను నటించిన ఆడు జీవితం:ది గోట్ లైఫ్ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

ఆడు జీవితం కథ రివీల్ చేసిన డైరక్టర్..

ఈ సినిమా గురించి పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. ఆడు జీవితం: ది గోట్ లైఫ్ సినిమా పాన్ ఇండియా వైడ్ గా ఈనెల 28న రిలీజ్ కాబోతున్నది.. ఈ సినిమా కోసం దాదాపుగా తాను ఆరేళ్లు కష్టపడ్డాను అంటూ తెలియజేశారు.. ఒక వ్యక్తి ఎడారిలో తప్పిపోతే ఎలా బయటికి వచ్చారనే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని.. ఈ సినిమా థ్రిల్లర్ జోనర్ లో రాబోతోందని వెల్లడించారు.ఆడు జీవితం:ది గోట్ లైఫ్ సినిమా కోసం దాదాపుగా 31 కిలోల బరువు కూడా తగ్గి.. చాలా సినిమాలను వదిలేసి ఎంతో కష్టపడి నటించాను అంటూ తెలిపారు పృథ్వీరాజ్ సుకుమారాన్.

రెమ్యునరేషన్ పై పృథ్వీరాజ్ షాకింగ్ కామెంట్స్..

ఈ ప్రమోషన్స్ లోనే ఓ ఇంటర్వ్యూలో మలయాళ సినిమా గురించి.. రెమ్యూనరేషన్ గురించి.. ఇతర పరిశ్రమల రెమ్యూనరేషన్ గురించి మాట్లాడడం జరిగింది.. యాంకర్ మాట్లాడుతూ.. మలయాళం లో మీరు ఎందుకు తక్కువ బడ్జెట్లో మంచి సినిమాలు చేసి మంచి హిట్ కొడతారు.. అది ఎలా సాధ్యమని అడగగా.. అందుకు పృథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ..ఇతర సినీ పరిశ్రమలలో రెమ్యూనరేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది.. వాస్తవానికి ఒక్క సినిమాకి రూ.75 కోట్ల బడ్జెట్ పెడితే.. అందులో రూ.55 కోట్లు రెమ్యూనరేషన్ కే వెళ్తుంది.. మేకింగ్ కి మిగిలింది కేవలం రూ .20 కోట్లు మాత్రమే అంటూ తెలిపారు..

- Advertisement -

అందుకే మా సినిమాలు హిట్ అవుతాయి..

కానీ మా దగ్గర అలా ఉండదు.. సినిమా మేకింగ్ కి ఎంత ఖర్చైనా చేస్తాము.. రెమ్యూనరేషన్ ఎక్కువగా అసలు ఉండదు.. నేను చాలా సినిమాలకు రెమ్యూనరేషన్ కూడా తీసుకోను.. కేవలం సినిమా మీదే ఖర్చు పెట్టమని చెబుతాము.. సినిమా హిట్ అయితే ప్రాపర్టీ లో నుంచి కొంత షేర్ తీసుకుంటామని వెల్లడించారు.. అందుకే మా సినిమాలు బాగుంటాయని.. కానీ అన్ని సినిమాలు బాగుంటాయని తాను మాత్రం చెప్పలేనని తెలిపారు పృథ్వీరాజ్ సుకుమారన్.. ఇటీవల కాలంలో మలయాళ సినిమాలకు గుర్తింపు రావడానికి కూడా మెయిన్ కారణం ఇదే అని కూడా వెల్లడించారు.

పృధ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran)కామెంట్స్ పై నెటిజన్స్ స్పందన..

ప్రస్తుతం పృధ్వీరాజ్ సుకుమారన్ చేసిన ఈ వ్యాఖ్యలు కూడా వైరల్ గా మారుతున్నాయి.. అయితే కొన్ని సినీ పరిశ్రమల హీరోల రెమ్యూనరేషన్ గురించి ఎక్కువగా హడావిడి చేస్తూ ఉంటారు అభిమానులు.. కానీ పృథ్వీరాజ్ సుకుమారన్ ఇలా చెప్పడంతో చాలామంది ఈ నటుడిని విమర్శిస్తూ ఉంటే మరికొంతమంది తాను చెప్పింది కరెక్టేనంటూ సపోర్ట్ చేస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు