Srinu Vaitla : ట్రైన్స్ సీన్ లెంతీగా ఉందని చాలామంది చెప్పారు

Srinu Vaitla : శ్రీను వైట్ల గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది దర్శకులలో శ్రీను వైట్ల శైలి వేరు అని చెప్పొచ్చు. ఇప్పటికీ సోషల్ మీడియాలో ప్రతి మీమ్ కంటెంట్ కూడా శ్రీనువైట్ల(Srinu Vaitla) సినిమాల నుంచి వచ్చిందని చెప్పొచ్చు.
ఇకపోతే నీకోసం సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు శ్రీనువైట్ల. కానీ శ్రీను వైట్లకి గుర్తింపు తీసుకొచ్చిన సినిమా మాత్రం ఆనందం అని చెప్పొచ్చు.

ఈ రెండు సినిమాలు కంటే ముందు సాంబిరెడ్డి అనే ఆయన ఇతడికి మొదటి సినిమా అవకాశం ఇచ్చారు. సినిమా పేరు అపరిచితుడు, రాజశేఖర్ హీరో. మొదటి షెడ్యూలు అవగానే హీరోకీ నిర్మాతకీ వచ్చిన డిఫరెన్సెస్ వల్ల ఆ సినిమా ఆగిపోయింది. సినిమా ఆగిపోయిందని నిరాశ పడటం కరెక్ట్ కాదని చెప్పి మళ్లీ ప్రయత్నాలు కొనసాగించి నీకోసం సినిమాతో దర్శకుడుగా మారిపోయాడు శ్రీను వైట్ల(Srinu Vaitla).

శ్రీను వైట్ల(Srinu Vaitla) చేసిన ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ అంటే శ్రీను వైట్ల అని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ మినహాయిస్తే దాదాపు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అందరితో కూడా పనిచేసే అవకాశం శ్రీనువైట్లకి దక్కింది. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, కింగ్ నాగార్జున సీనియర్ స్టార్ హీరోలు అందరితో పని చేసే అవకాశం దొరికిన ఒక డైరెక్టర్ శ్రీను వైట్ల అని చెప్పొచ్చు.

- Advertisement -

ఇకపోతే ప్రస్తుతం శ్రీను వైట్ల ఒక హిట్ సినిమాను చూసి చాలా రోజులైంది. ఒకప్పుడు ప్రేక్షకులు శ్రీనువైట్ల సినిమా అంటేనే హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయొచ్చు గ్యాంగ్ తో వెళ్లొచ్చు అని ఫీల్ అయ్యేవాళ్ళు. శ్రీను వైట్ల సినిమాలో కామెడీ టైమింగ్ ప్రత్యేకమని చెప్పొచ్చు. మంచి క్యారెక్టర్స్ ని డిజైన్ చేసి ఆ క్యారెక్టర్స్ తో కామెడీని పండించగలడంలో ఒకప్పుడు శ్రీను వైట్ల దిట్ట.

మహేష్ బాబుతో చేసిన దూకుడు సినిమా శ్రీను వైట్ల కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్. ఆ సినిమా తర్వాత ఇప్పటివరకు సరైన సినిమా శ్రీను వైట్ల కెరియర్ లో రాలేదు. ఎన్టీఆర్ తో చేసిన బాద్షా సినిమా కొంతవరకు పర్లేదు అనిపించింది. బాద్షా సినిమా తర్వాత హిట్ సినిమా చూసి దాదాపు చాలా ఏళ్ళు అయిపోయింది. ఆ తర్వాత చేసిన కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గానే మిగిలాయి. ఇకపోతే ప్రస్తుతం గోపీచంద్ శ్రీనువైట్ల సినిమాని చేస్తున్నాడు.

ఇక రీసెంట్ గా వెంకీ సినిమా రీ రిలీస్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాను థియేటర్లో మరోసారి వీక్షించారు శ్రీను వైట్ల. అయితే ఈ సినిమా గురించి రీసెంట్ గా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అద్భుతమైన విశేషాలను పంచుకున్నారు.
వెంకీ సినిమాలో ట్రైన్ ఎపిసోడ్ ఎంత బాగా పాపులర్ అయిందో మనకు తెలియంది కాదు. అయితే ఈ సినిమా శ్రీనువైట్ల జీవితంలో జరిగిన ఒక పర్సనల్ ట్రైన్ జర్నీ వలన ఇన్స్పైర్ అయ్యి చేశారు అంట. ఇకపోతే ఒకే కంపార్ట్మెంట్లో ట్రైన్స్ సీన్ అంతసేపు ఉంచడం కరెక్ట్ కాదు అని చాలామంది వారి అభిప్రాయం వ్యక్తం చేశారు అంటూ చెప్పుకొచ్చాడు. కానీ ఈ ట్రైన్ సీన్ అద్భుతంగా వర్కౌట్ అయింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు