Tamannaah Bhatia : అందుకే సంపత్ నంది అంత రెమ్యూనరేషన్ ఇస్తున్నాడా.?

Tamannaah Bhatia : 2005లో రిలీజ్ అయిన శ్రీ సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీంచింది తమన్నా(Tamannaah Bhatia). సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదు అనిపించింది. ఆ తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీడేస్ సినిమాలో మధు పాత్రలో కనిపించింది. హ్యాపీ డేస్ లో బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చాలామంది యూత్ కి క్రేజీగా ఎక్కింది హ్యాపీడేస్ సినిమా. ఇప్పటికీ శేఖర్ కమ్ముల బెస్ట్ వర్క్ అంటే హ్యాపీడేస్ అని చెప్పొచ్చు.

ఆ సినిమాతో ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకుంది తమన్న.
ఆ సినిమా తర్వాత కొన్ని సినిమాల్లో కనిపించిన కూడా సిద్ధార్థ హీరోగా చేసిన కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమా తో హీరోయిన్ మంచి గుర్తింపును సాధించి ఇండస్ట్రీలో నిలదొక్కుకుంది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 100% లవ్ సినిమా తమన్నకి మంచి పేరును తీసుకొచ్చింది.

ఈ సినిమాలు తర్వాత తమన్నా(Tamannaah Bhatia) కూడా ఒక స్టార్ హీరోయిన్ అయిపోయింది. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సరసన కూడా తమన్నా నటించిన తెలుగు హీరోయిన్ గా స్థిరపడిపోయింది అని చెప్పొచ్చు. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాతో తమన్నా పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది.

- Advertisement -

బాహుబలి సినిమా సాధించిన విజయం గురించి మనకు తెలియదు కాదు తెలుగు సినిమా స్థాయిని పెంచిన సినిమా బాహుబలి అని చెప్పొచ్చు. ఆ సినిమా తర్వాత చేసిన కొన్ని సినిమాలు కూడా తమన్నా కెరియర్ లో పర్వాలేదు అనిపించుకున్నాయి.

ఇకపోతే తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎవరి హవా అయినా కొంతకాలం వరకే నిలబడుతుంది. ఒకప్పుడు అనుష్క, త్రిష , నయనతార వంటి సీనియర్ హీరోయిన్లు ఇండస్ట్రీలో సూపర్ హిట్ సినిమాలు చేసి తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నారు. ఆ తర్వాత వీళ్లు కూడా లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ తమ కెరియర్ ముందుకు నడిపారు. తర్వాత మీరు కూడా కొంతకాలం కనుమరుగై మళ్ళీ ఇప్పుడు సినిమాలు చేస్తున్నారు.

ఇకపోతే తమన్నా విషయానికి వస్తే ప్రస్తుతానికి చెప్పుకోదగ్గ ప్రాజెక్ట్ లు లేవ. ఓన్లీ ఓటీటీ లో మాత్రమే కొన్ని సిరీస్, సినిమాలు చేస్తుంది తమన్న. ఇకపోతే తమన్నా ప్రస్తుతం ఛాన్స్ లు లేక 50 లక్షలకు కూడా సినిమా చేయడానికి చేయడానికి రెడీ అవుతున్నట్లు సమాచారం వినిపిస్తుంది.

ఇకపోతే దర్శకుడు సంపత్ నంది కి తమన్నాతో మంచి ర్యాపో ఉందని చెప్పొచ్చు. ఇదివరకే వీరి కాంబినేషన్ లో రచ్చ, బెంగాల్ టైగర్, సీటిమార్ వంటి సినిమాలు కూడా వచ్చాయి. అందుకే సంపత్ నంది ఓదెల 2లో తమన్నాకి ఛాన్స్ ఇచ్చాడని కూడా చెప్పొచ్చు. ఈ సినిమాకి సంబంధించి 1.3 కోట్లు రెమ్యునరేషన్ సంపత్ నంది ఇస్తున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే ప్రస్తుతం తమన్నా ఉన్న పరిస్థితికి ఇది ఇది కొంచెం ఎక్కువే అని చెప్పొచ్చు. అందుకే తమన్నా కూడా ఈ సినిమాను చేయడానికి ఒప్పుకుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు