Gautham Vasudev: మహేష్ బాబు చేసిన ఆ పొరపాటు తెలుసా

కొన్ని సినిమాలు చాలా నమ్మకం పెట్టి చేస్తాము. కానీ బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమాని ఇచ్చే ఫలితాలు నిరాశను మిగులుస్తాయి. ఇంకొన్ని సినిమాలను కొన్నిసార్లు నమ్మలేము కానీ అదే సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ సినిమాలుగా మిగిలిపోతాయి. కేవలం బ్లాక్ బస్టర్ సినిమాలుగా కాకుండా అదే ఒక కల్ట్ క్లాసిక్ గా మిగిలిపోతే ఆ సినిమాను వదులుకున్న హీరో బాధ ఎలా ఉంటుందో మాటల్లో చెప్పలేనిది.

తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో లవ్ స్టోరీస్ కి ఉన్న ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చాలామంది యూత్ లవ్ స్టోరీస్ చూడటానికి ఎక్కువ ఇష్టపడతారు. మణిరత్నం సినిమాలు ఎక్కువగా ఆడటానికి కారణం కూడా మణిరత్నం ఎంచుకునే ఆ లవ్ స్టోరీస్. ఒక రోజా, సఖి, గీతాంజలి వంటి సినిమాలు ఎంత పెద్ద విజయాన్ని సాధించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

లవ్ స్టోరీస్ తీయటంలో మణిరత్నం గురువు అని చెప్పొచ్చు. అందుకనే మణిరత్నం ను చాలామంది లవ్ గురు అని పరిగణిస్తారు. ఆ తర్వాత ఆ స్థాయిలో లవ్ స్టోరీస్ ని ప్రజెంట్ చేసే దర్శకుడు గౌతమ్ మీనన్ అని చెప్పొచ్చు. గౌతమ్ కెరియర్లో మంచి హిట్ అయిన సినిమా అంటే ఏ మాయ చేసావే.

- Advertisement -

ఈ సినిమాను మొదలు పెట్టినప్పుడు “ఈ ప్రపంచంలో ఎంతోమంది అమ్మాయిలు ఉండగా నేను జెస్సీ ను మాత్రమే ఎందుకు ఇష్టపడ్డాను” అంటూ ఒక లైన్ తో రాయడం స్టార్ట్ చేశాడు గౌతమ్. దీంతో ఈ సినిమాను కూడా పూర్తి చేశాడు. ఈ సినిమాను మహేష్ బాబు యొక్క సిస్టర్ మంజులాకి చెప్పినప్పుడు మహేష్ కి చెప్పమని చెప్పారు. ఇదే కథను మహేష్ బాబుకి చెప్పుకొచ్చాడు గౌతమ్ వాసుదేవ్.

అయితే మహేష్ బాబు ఈ కథను విన్న తర్వాత కథ బాగుంది. మనిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తుంది అని అంటే అది ఒక బిగ్ స్కేల్ లో ఉండాలి అనేటట్లు చెప్పుకొచ్చారు. కానీ గౌతమ్ నమ్మింది ఏంటంటే ఈ సినిమాను మనం చేస్తే ఇదే బిగ్ స్కేల్ అవుతుందంటూ బిలీవ్ చేశాడు. కానీ ఆ సినిమా మొత్తానికి పట్టాలెక్కలేదు. అలా మహేష్ వదులుకున్న సినిమానే నాగచైతన్య కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది.

Check out Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు