Sundeep kishan : పదోరోజు కుమ్మేసిన ‘భైరవకోన’.. అయినా బ్రేక్ ఈవెన్ కి దూరంలో?

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ హీరోగా నటించిన “ఊరుపేరు భైరవకోన” పది రోజుల కింద థియేటర్లలో రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. మరీ బ్లాక్ బస్టర్ రేంజ్ లో కాకపోయినా, ఉన్నంతలో రీసెంట్ గా వచ్చిన సినిమాల్లో మిక్సడ్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమా, థియేటర్లలో మౌత్ టాక్ ఎఫెక్ట్ తో మంచి పెర్ఫార్మన్స్ చూపించింది. సందీప్ కిషన్ నుండి చాలా రోజుల తర్వాత క్రేజీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా హారర్ సస్పెన్స్ థ్రిల్లర్ కావడంతో థియేటర్లకు ఒక వర్గం ప్రేక్షకులు థియేటర్లకు వచ్చేలా చేస్తుంది. అయితే విడుదలై పది రోజులైనా ఈ సినిమా ఇంకా బ్రేక్ ఈవెన్ కాకపోవడం ఆశ్చర్యమే. ఎందుకంటే మేకర్స్ ఆల్రెడీ తమ సినిమా నాలుగురోజుల్లో బ్రేక్ ఈవెన్ అయిందని ప్రకటించుకున్నా, అఫిషియల్ థియేటర్స్ లెక్కల ప్రకారం భైరవ కోన ఇంకా బ్రేక్ ఈవెన్ కి దూరంలోనే ఉంది.

ఇక రెండో వారంలోకి ఈ సినిమా అడుగుపెట్టగా, ఈ వారం పలు చిన్న సినిమాలు బాగా రిలీజ్ అవడంతో చాలా థియేటర్లను కోల్పోవాల్సి వచ్చింది. అయితే ఆ రిలీజ్ అయిన సినిమాలన్నిటికి నెగిటివ్ టాక్ రావడంతో అది ఊరు పేరు భైరవకోనకి ప్లస్ అయింది. అందుకే రెండో వీకెండ్ లో మంచి కలెక్షన్లతో కుమ్మేసింది. తాజాగా ఈ సినిమా పది రోజుల కలెక్షన్స్ బయటికి రాగా, పదో రోజు ఊరు పేరు భైరవకోన తెలుగు రాష్ట్రాల్లో 25 లక్షల షేర్ వరల్డ్ వైడ్ గా 30 లక్షల షేర్ ని రాబట్టింది. ఇక పదిరోజుల్లో వరల్డ్ వైడ్ గా 9.39 కోట్ల షేర్, 18. 45 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. అయితే ఈ సినిమా ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదన్నది వాస్తవం. 11 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అయిన ఈ సినిమా లాభాల్లోకి అడుగుపెట్టాలంటే ఇంకా 1.61 కోట్ల కలెక్షన్స్ వసూలు చేయాలి.

ఇక ఈ వారం వచ్చిన ఏ సినిమా కూడా ఆకట్టుకోకపోవడంతో ఈ సినిమా మంచి కలెక్షన్లు రాబట్టే ఛాన్స్ ఉంది. మరి బ్రేక్ ఈవెన్ అవుతుందా అంటే చెప్పడం కష్టమే. అయినా ఏదైనా మ్యాజిక్ జరగొచ్చు. ఇక సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ సినిమాకు vi ఆనంద్ దర్శకత్వం వహించగా వర్ష బొల్లమ, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించారు.

- Advertisement -

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు