Tamannaah: తమన్నా అసలు పేరు ఇదా.. ఎందుకు మార్చుకుందంటే..?

టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా ఇప్పటికీ హవా కొనసాగిస్తున్న హీరోయిన్లలో తమన్నా కూడా ఒకరు.. ఈ ముద్దుగుమ్మ వయసు పెరుగుతున్నప్పటికీ గ్లామర్ తో మాత్రం కుర్రకారును పిచ్చెక్కిస్తూ ఉంటుంది. నటిగా తన సినీ కెరీర్ ని ప్రారంభించి ఇప్పటికీ 20 ఏళ్లు పూర్తి చేసుకున్న తమన్నా.. పలు చిత్రాలలో , వెబ్ సిరీస్లలో నటిస్తూ అందరిని ఆకట్టుకుంటోంది. కేవలం తెలుగులోనే కాకుండా బాలీవుడ్ , కోలీవుడ్ సినీ పరిశ్రమలలో కూడా తన హవా కొనసాగిస్తోంది. ఇప్పుడు తాజాగా తమన్నా గురించి ఒక న్యూస్ వైరల్ గా మారుతోంది.

అదేమిటంటే తమన్నా పేరు ఇది కాదని.. తన పేరు మార్చుకుందని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.. ఈ విషయాన్ని ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో తమన్నా తన పేరులో ఉండే సీక్రెట్ ని సైతం బయటపెట్టింది.. తమన్నా అంటే అర్థం కోరిక అని వస్తుందట.. తమన్న తొమ్మిదేళ్ల వయసులో ఉన్నప్పుడే నటిగా కావాలని ఫిక్స్ అయిందట.. దీంతో టీనేజ్ వచ్చేసరికి మోడలింగ్ రంగం వైపు అడుగుపెట్టి 2005లో ఒకేసారి తెలుగు , హిందీ సినిమాలతో హీరోయిన్గా ఎంట్రి ఇచ్చింది.

ఆ తర్వాత తమిళ్ , కన్నడ వంటి భాషలలో కూడా నటించింది తమన్నా.. తెలుగు లోనే కొన్ని సినిమాలలో నటించి కొన్నేళ్లపాటు స్టార్ హీరోయిన్గా గుర్తింపు సంపాదించుకుంది.. సినిమాలలోకి ఎంట్రీ ఇస్తున్న సమయంలో తమన్నా తో ఒక స్వామీజీ ఈమె పేరును మార్పు చేసుకోమని సలహా ఇచ్చారట.. అందుకే తమన్నా పేరు ఇంగ్లీషులో అదనంగా a,h అనే పదాలను జోడించారు.. ఇప్పుడు తన పేరు tamannaah అయిందని తెలియజేసింది ఈ ముద్దుగుమ్మ.

- Advertisement -

ఈ పేరు మార్చడం వల్ల తనలో ఒక పాజిటివ్ ఫీలింగ్స్ సైతం తీసుకువచ్చిందని.. కెరియర్ పరంగా కూడా తనకి బాగా కలిసి వచ్చిందని తమన్నా ఇటీవలే ఇంటర్వ్యూలో తెలియజేసింది. గత కొన్నేళ్లుగా తమన్న బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డేటింగ్ లో ఉందనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి.. ఇప్పటివరకు ఈ విషయం పై అధికారికంగా వీరిద్దరు ఎక్కడ ప్రకటించలేదు కానీ ఇద్దరు చట్టపట్టలేసుకొని తిరుగుతున్నట్టు పలు రకాల ఫోటోలు, వీడియోలు అయితే వైరల్ గా మారుతున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం తమన్నా త్వరలోనే వివాహం చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు