Samantha @14 years: సమంత కెరియర్ లో రిజెక్ట్ చేసిన చిత్రాలు ఇవే..!

టాలీవుడ్ హీరోయిన్ సమంత సినిమాల జడ్జిమెంట్ గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. సమంత నటించిన చిత్రాలు చాలా వరకు సక్సెస్ పర్సంటేజ్ ఎక్కువగా ఉన్న హీరోయిన్ అని కూడా చెప్పవచ్చు.. భారీ సక్సెస్ అందుకున్న సమంత ఇటీవల కాలంలో పెద్దగా సినిమాలలో కనిపించలేదు.. అందుకు ముఖ్య కారణం ఈమె మయోసిటీస్ అనే వ్యాధితో బాధపడుతున్న విషయం తెలిసిందే. చివరిగా ఖుషి అనే చిత్రంలో నటించిన ఈమె.. ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. సమంత ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి 14 సంవత్సరాలు కావస్తోంది.. దీంతో సమంతా రిజెక్ట్ చేసిన సినిమాల గురించి ఒకసారి ఇప్పుడు చూద్దాం.

సమంత మొదట ఏం మాయ చేసావే సినిమా నుంచి ఈగ సినిమా వరకు భారీ విజయాలను అందుకుంది.. ఆ తర్వాత కాస్త సినిమాల పరంగా స్లో అయిపోయిందనే చెప్పాలి. మరోవైపు సమంత కెరియర్ లో కూడా చాలా తక్కువ ఫ్లాపులు ఉండడం గమనార్హం. ఇకపోతే సమంత ఈ 14 సంవత్సరాల సినీ కెరియర్ లో కొన్ని బ్లాక్ బస్టర్ చిత్రాలను కూడా వదులుకుంది. వాటి గురించి ఇప్పుడు చూద్దాం.. డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ప్రేమ కథ చిత్రం కడలి.. ఈ సినిమాలో ముందుగా హీరోయిన్ గా సమంతా ని అధికారికంగా ప్రకటించారు.. కానీ చివరి నిమిషంలో సమంత ఈ సినిమా నుంచి తప్పుకుంది.

మరోవైపు రామ్ చరణ్, అల్లు అర్జున్ మల్టీ స్టారర్ గా వచ్చిన ఎవడు చిత్రం కూడా ముందుగా సమంతాకే వచ్చిందట. ఒక షెడ్యూల్ ని పూర్తి చేసిన తర్వాత ఆరోగ్య సమస్యల వల్ల సమంత ఈ సినిమా నుంచి తప్పుకుంది. డైరెక్టర్ శంకర్, విక్రమ్ కాంబినేషన్లో వచ్చిన ఐ సినిమాలో కూడా సమంతా ని హీరోయిన్గా అనుకున్నారట… సమంత కూడా ఈ సినిమాకి ఓకే చెప్పినా.. కొన్ని పర్సనల్ కారణాలవల్ల సమంత వదిలేసిందట.

- Advertisement -

అలాగే రామ్ చరణ్ – శ్రీనువైట్ల కాంబినేషన్లో వచ్చిన బ్రూస్లీ సినిమాలో కూడా ముందుగా హీరోయిన్ గా సమంతనే అనుకున్నారట. ఆ సమయంలో డేట్లు ఖాళీగా లేకపోవడంతో సమంత ఈ సినిమాని వదిలేసిందట. నానితో ఈగ, ఎటో వెళ్లిపోయింది మనసు సినిమాలలో నటించిన సమంతకి నిన్ను కోరి సినిమాలో కూడా అవకాశం వచ్చిందట. తన పెళ్లి పనులలో బిజీగా ఉండడం చేత ఈ సినిమాని వదులుకుందట. బాలీవుడ్ నిర్మాతలు యూటర్న్ సినిమాని సమంతతో చేయాలని అనుకున్నారట. తెలుగు , తమిళంలో ఈ సినిమా ఫలితం చూశాక పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదట.

ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో చాలామంది నటించారు. ఒక చిన్న పాత్ర కోసం సమంతను అప్రోచ్ అవ్వగా సమంత రిజెక్ట్ చేసిందట. కరణ్ జోహార్ స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమా కోసం ముందుగా సమంతను సంప్రదించగా… బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి సమంత పెద్దగా ఇంట్రెస్ట్ చూపలేదట. అశ్విన్ , శర్వానంద్ , నయనతార కాంబినేషన్లో వచ్చిన చిత్రం మయూరి.. ఈ చిత్రంలో సమంతను ముందుగా హీరోయిన్గా అనుకున్నారట. కొన్ని కారణాల చేత ఈ సినిమాలో నయనతార నటించింది. పుష్ప సినిమాలో కూడా మొదట సమంతను హీరోయిన్గా అనుకున్నారట. ఈ ఆఫర్ ని కూడా సమంత రిజెక్ట్ చేసిందట. కానీ చివరిగా స్పెషల్ సాంగ్ లో నటించడానికి ఒప్పుకుంది. అలాగే చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాను కూడా రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది.

Checkout Filmify for the latest Movie news in Telugu, New Movie Reviews & Ratings, and all the Entertainment News. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other film industries Movies updates, etc

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు