Lifestyle : చిన్న చిన్న విషయాలను కూడా పదే పదే మర్చిపోతున్నారా?

Lifestyle : కొంతమంది చిన్న చిన్న విషయాలను కూడా తరచుగా మర్చిపోతూ ఉంటారు. బైక్ కీ ఎక్కడో పెట్టి మర్చిపోవడం, ఫోన్ ఎక్కడ పెట్టామో గుర్తు రాకపోవడం, చేతిలోనే కీస్ పట్టుకొని ఊరంతా వెతకడం లాంటివి అందరి జీవితంలోనూ జరిగే చిన్న చిన్న విషయాలే. ఏ వస్తువులు ఎక్కడ పెట్టామో, మాట్లాడుతూ మాట్లాడుతూ ఏం మాట్లాడాలనుకుంటున్నామో మర్చిపోవడం వంటివి అప్పుడప్పుడు జరగడం కామన్. ఇతర పనులలో బిజీగా ఉండడం వల్ల చాలాసార్లు ఇలాంటి చిన్న విషయాలను మర్చిపోతూ ఉంటాము. కానీ సమస్య ఎక్కువైనప్పుడు నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో అది మతిమరుపుగా మారే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచే ఈ అలవాటును దూరం చేసుకోవడానికి ప్రయత్నించడం మంచిది. వయసు పెరిగే కొద్దీ చిన్న చిన్న విషయాలను సైతం మర్చిపోవడం అనేది సర్వసాధారణ విషయం. అయినప్పటికీ ఆ సమస్యను మనం లైఫ్ స్టైల్ (Lifestyle) లో కొని చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. మరి మతిమరుపు రాకుండా ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండాలంటే ఏం చేయాలి? అంటే…

1. హెల్దీ లైఫ్ స్టైల్

ప్రస్తుతం మనం ఫాలో అవుతున్న లైఫ్ స్టైల్ చాలా రోగాలకు నిలయంగా మారుతుంది. ముఖ్యంగా సమయానికి నిద్రపోవడం అన్నది కష్టంగా మారుతుంది చాలామందికి. మతిమరుపు సమస్య మొదలవ్వడానికి ముఖ్య కారణం సరిగ్గా నిద్ర పోకపోవడం కూడా. ప్రతిరోజు 7 నుంచి 8 గంటల పాటు నిద్రపోవడం మంచిది. అప్పుడే బ్రెయిన్ తో పాటు శరీరానికి రెస్ట్ దొరికి ఫ్రెష్ గా ఫీల్ అవుతారు. లేదంటే ఒత్తిడి పెరిగి మతిమరుపు లాంటి సమస్యలు మొదలవుతాయి. ఒకవేళ ఎక్కువగా విషయాలను మర్చిపోవడం, మనుషులను మర్చిపోవడం అలాంటివి జరిగితే డాక్టర్ ను సంప్రదించడానికి వెనకాడకండి.

2. మానసికంగా చురుగ్గా ఉండడం

మానసికంగా ఆరోగ్యంగా ఉంటే ఎల్లప్పుడూ చురుగ్గా ఉంటారు. మతిమరుపు అనేది మన జోలికి రాదు. కాబట్టి ఎప్పుడూ ఏదో ఒక పనిలో బిజీగా ఉండేలా చూసుకోండి. కొత్త విషయాలను నేర్చుకోండి, పజిల్స్, గేమ్స్, మ్యూజిక్ వంటి వాటి కోసం టైం స్పెండ్ చేయండి.

- Advertisement -

3. డైరీ రాయడం

బిజీ షెడ్యూల్ కారణంగా చాలామంది తమ చేయాలనుకున్న పనులను మర్చిపోతూ ఉంటారు. అలాంటప్పుడు డైరీ రాసే అలవాటు బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. మీరు చేయాలనుకున్న ముఖ్యమైన పనులన్నీ డైరీలో రాసుకోవచ్చు. అప్పుడు మర్చిపోయే అవకాశం ఉండదు.

4. ఇతరులతో టైం స్పెండ్ చేయండి

ఈ బిజీ షెడ్యూల్ కారణంగా ఉదయాన్నే జాబ్ కి వెళ్లడం, సాయంత్రానికి వచ్చి చతికిలపడడంతో సరిపోతుంది. కానీ కాస్త ఫ్రీ టైం చూసుకుని ఇతరులతో అంటే ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులతో టైం స్పెండ్ చేస్తే తేలికగా ఫీల్ అవుతారు. ముఖ్యంగా మీరు చెప్పేది వినే వ్యక్తులతో టైం స్పెండ్ చేయండి. అప్పుడు డిప్రెషన్, యంగ్జైటి వంటి సమస్యలు దూరమవుతాయి. మతిమరుపు వచ్చే అవకాశం కూడా తగ్గిపోతుంది.

5. వ్యాయామం

మీరు ఏదైనా ఒక విషయాన్ని తరచుగా మర్చిపోవడం లాంటిది జరిగితే అది మెదడులో రక్త ప్రసరణ సరిగ్గా పోవడం వల్ల కూడా కావచ్చు. కాబట్టి రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల శరీరంలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. జాగింగ్, ఏరోబిక్స్, వాకింగ్, సైక్లింగ్ వంటి ఎక్సర్సైజ్ లను చేయడం బెటర్. అప్పుడు శారీరకంగా, మానసికంగా ఫిట్ గా ఉంటారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు