Ramayan : బాలీవుడ్ వాళ్లు యష్‌ను అన్యాయం చేశారా…?

Ramayan : బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ రామాయణం సినిమా చేసి, విపరీతంగా ట్రోల్ అయ్యాడు. అది తెలిసి కూడా మరో బాలీవుడ్ డైరెక్టర్ రామాయణాన్ని తెరకెక్కించడానికి ముందుకు వస్తున్నాడు. ఆయనే నితీష్ తివారి. రాముడిగా రణబీర్ కపూర్ ఫిక్స్ అయినట్టు కనిపిస్తున్నా… సీత విషయంలో ఇంకా క్లారిటీ అయితే రాలేదు. కానీ, రావణ్ పాత్ర రాకింగ్ స్టార్ యష్ ఆల్మోస్ట్ కన్ఫామ్. అయితే ఇప్పుడు రామాయణ్(Ramayan) మేకర్స్ తీసుకున్న ఓ నిర్ణయం వల్ల యష్ అసంత్రుప్తితో ఉన్నారట. అంతే కాదు, యష్ ఫ్యాన్స్ అయితే డైరెక్టర్ నితీష్ తివారిపై ఫైర్ అవుతున్నారు. దీనికి గల కారణం ఏంటంటే…?

బాలీవుడ్‌లోనే కాదు, ఇండియన్ సినీ హిస్టరీలోనే అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా రామయణ్‌ను నితీష్ తివారి తెరకెక్కించబోతున్నారు. ఎక్కడా కూడా మైనస్ రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు నితీష్. అలా సినిమాలో కాస్ట్ అండ్ క్రూ విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉంటున్నాడు. దాదాపు అన్ని పాత్రలు ఫైనల్ అయ్యాయి. కానీ, ఒక సీత పాత్రపైనే ఇంకా క్లారిటీ లేదు. మొదట్లో ఈ సీత పాత్రను సాయి పల్లవి చేయబోతుందని టాక్ వచ్చింది. తర్వాత అలియా భట్, జాన్వీ కపూర్ అంటూ చాలా పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ, ఇప్పటికీ సీత పాత్ర ఫైనల్ కాలేదని టాక్.

అయితే రీసెంట్‌గా రామయణ్‌లోని మండోదరి పాత్ర ఫైనల్ అయినట్టు తెలుస్తుంది. మండోదరి పాత్రను ప్రముఖ టీవీ నటి సాక్షి తన్వర్ చేయబోతుంది. ఇప్పటికే ఈ పాత్రకు సంబంధించిన వర్క్ షాప్‌ కూడా చేస్తుందట. అయితే ఇది యష్ ఫ్యాన్స్ కు మాత్రం నచ్చడం లేదు. ఎందుకంటే… కేజీఎఫ్ తర్వాత యష్ క్రేజ్ భారీగా పెరిగింది. ఆయన పక్కన నటించడానికి స్టార్ హీరోయిన్స్ రెడీ గా ఉన్నారు. కానీ, రామయణ్‌లో యష్ పక్కన మండోదరి పాత్రలో ఓ టీవీ నటి చేస్తుంది అనేది యష్ అభిమానులకు పెద్దగా నచ్చడం లేదు.

- Advertisement -

యష్ కూడా ఇదే కారణంతో అసంత్రుప్తిగా ఉన్నాడని తెలుస్తుంది. ముందుగా రావణ్ పాత్ర చేయడానికి యష్ కు ఇష్టం లేదట. కానీ, తర్వాత పరిస్థితులు ఆయనను ఒప్పించాయని సమాచారం. ఇప్పుడు తన పక్కన ఉండే పాత్ర కోసం ఓ టీవీ నటి తీసుకోవడంతో యష్ మరోసారి ఆలోచిస్తున్నారని టాక్ వస్తుంది. అయితే రామయణ్‌లో మండోదరి పాత్ర చాలా తక్కువగా ఉంటుంది. ఆమె కొన్ని సీన్స్‌లోనే కనిపిస్తారు. అలాంటి చిన్న పాత్రకు స్టార్ హీరోయిన్ ఎందుకు అనే ఉద్ధశ్యంతోనే టీవీ నటి సాక్షి తన్వర్ ను తీసుకున్నట్టు తెలుస్తుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు