Ranbeer Kapoor: రణబీర్ కపూర్ లగ్జరీ లైఫ్.. ఎన్ని కోట్లకు అధిపతో తెలుసా..?

ప్రముఖ బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తాజాగా నటించిన చిత్రం యానిమల్.. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను డిసెంబర్ ఒకటో తేదీన విడుదలకు సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే రణబీర్ కపూర్ కి సంబంధించిన విషయాలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. అందులో భాగంగానే ఆయన అనుభవిస్తున్న లగ్జరీ లైఫ్.. ఆ లగ్జరీ లైఫ్ అనుభవించడానికి దాని వెనుక ఉన్న ఆయన ఆస్తి అన్నీ కూడా మరింత వైరల్ గా మారుతూ ఉండడం గమనార్హం. ఇకపోతే రణబీర్ కపూర్ ఆస్తుల వివరాలు ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.

రణబీర్ కపూర్ కి మూడు ఖరీదైన ఇల్లు ఉండగా.. అందులో మొదటిది.. బాంద్రాలోని వాస్తు పాలి హిల్ బిల్డింగ్‌లో 5, 7వ అంతస్తులో 2460 చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు ఇళ్ళు ఉన్నాయి. వాటి ఖరీదు ఒక్కొక్కటి రూ.35 కోట్లు.. అయితే ఏడో అంతస్తులో తాను నివాసం ఉండగా.. ఐదవ అంతస్తును రూ.8 లక్షలకు అద్దెకు ఇచ్చారు. అంతేకాదు రూ.500 కోట్ల విలువ గల కృష్ణ రాజ్ బంగ్లాకి కూడా ఈయన వారసుడు.. ఇది 15 అంతస్తుల అపార్ట్‌మెంట్‌. ఇక రణబీర్ కపూర్ కార్ గ్యారేజ్ లో ఉన్న కార్ల విషయానికొస్తే.. ఆడి R 8, రూ. 1.6 కోట్ల విలువైన వైట్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్, రూ.87 లక్షల విలువైన రేంజ్ రోవర్ స్పోర్ట్స్, రూ.1.56 కోట్ల విలువైన ఆడి A 8l, రూ. 2.14 కోట్ల విలువ గల మెర్సిడెస్ బెంజ్ G 63 AMG వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి. మొత్తం ఈ కార్ల విలువ రూ.7 కోట్ల పైమాటే.

అంతేకాదు పలు బ్రాండ్ ఎండార్స్మెంట్ల కోసం పనిచేస్తున్న ఈయన రోజుకు రూ .6 కోట్ల వరకు వసూలు చేస్తాడు. అలాగే ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్‌బాల్‌లో ముంబై సిటీ FC అనే స్పోర్ట్స్ టీమ్‌ని కూడా సొంతం చేసుకున్నాడు. ఇక ఒక్కో సినిమాకు రూ. 70 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నారు. మొత్తం కలుపుకొని 2023 నాటికి రణబీర్ కపూర్ నికర ఆదాయం రూ.600 కోట్లకు చేరింది. అంతేకాదు తల్లిదండ్రుల వారసత్వంగా కూడా ఈయనకు మరింత ఆస్తి కలిసొచ్చే అవకాశం ఉందని సమాచారం. అలాగే ఈయన భార్య ఆలియా కూడా ప్రముఖ స్టార్ హీరోయిన్ కాబట్టి ఆమె కూడా భారీగానే సంపాదించినట్లు తెలుస్తోంది.

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు