Anil Ravipudi : డైరెక్టర్ కు కాస్ట్లీ గిఫ్ట్… ట్రెండ్ కంటిన్యూ చేస్తున్న నిర్మాతలు

ఇండస్ట్రీలో కొత్త కొత్త ట్రెండ్ లు క్రియేట్ చేస్తున్నారు మేకర్స్. ఇటీవల కాలంలో తమకు హిట్ ఇచ్చిన డైరెక్టర్స్ ను నిర్మాతలు కాస్ట్లీ గిఫ్ట్స్ ఇచ్చి సినీ వర్గాల్లో హాట్ టాపిక్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా కామెడీ కిల్లర్, దర్శకుడు అనిల్ రావిపూడికి నిర్మాతలు ఇలాగే ఓ కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వడం చర్చకు దారి తీసింది. ఇప్పటి వరకు వరుసగా ఏడు బ్లాక్‌బస్టర్‌ సినిమాలను రూపొందించి, చాలామంది హీరోలకు కెరీర్ ను ఇవ్వడమే కాకుండా నిర్మాతలకు కాసుల వర్షం కురిపించాడు

ఈ యంగ్ డైరెక్టర్. ఇటీవలే ఈయన దర్శకత్వంలో తెరకెక్కిన “భగవంత్ కేసరి” మూవీ దసరా కానుకగా విడుదలైన విషయం తెలిసిందే. ఈ మూవీలో నందమూరి బాలకృష్ణ హీరోగా, మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ శ్రీలీల కీలకపాత్రలో నటించారు. సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ బాలయ్యతో రొమాన్స్ చేసింది. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ నిర్మించింది. ఈ మూవీ దసరా బ్లాక్ బస్టర్ గా నిలిచి, బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. నందమూరి ఫ్యాన్స్ కు కావలసిన కమర్షియల్ అంశాలను మెండుగా కలిపి, ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా ఆయన మూవీని తెరకెక్కించిన తీరుపై విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు.

ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. ఓటిటి ప్లాట్ఫామ్ వేదికపై కూడా ఈ మూవీ నెంబర్ వన్ గా ట్రెండ్ అవుతూ హిస్టరీ క్రియేట్ చేస్తోంది. అమెజాన్ ప్రైమ్‌లో ఈ చిత్రానికి అన్ని భాషల్లో అద్భుతమైన స్పందన వస్తోంది. షైన్ స్క్రీన్స్ నిర్మాతలు బ్లాక్ బస్టర్ సక్సెస్‌తో సూపర్ డూపర్ హ్యాపీగా ఉన్నారు. “భగవంత్ కేసరి” ఎమోషనల్ కంటెంట్‌తో చాలా మంది హృదయాలను గెలుచుకోవడంతో పాటు నిర్మాతలు మరియు పంపిణీదారులకు మంచి లాభాలను కూడా సంపాదించింది. ఈ మూవీ సక్సెస్ కావడంతో ఉప్పొంగిపోయిన “భగవంత్ కేసరి” నిర్మాతలు అనిల్ రావిపూడికి కాస్ట్లీ కారు టయోటా వెల్‌ఫైర్‌ను గిఫ్ట్ గా ఇచ్చారు. నిజానికి ఇలా పనితీరును ప్రశంసిస్తూ గిఫ్ట్ లు వస్తే, అవి డైరెక్టర్స్ ను మరింత జోష్ తో ముందుకు నడిపిస్తాయి.

- Advertisement -

అంతేకాకుండా ఇన్ని బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన అనిల్ రావిపూడి ఇలాంటి సూపర్ గిఫ్ట్ కి అర్హుడేనని అంటున్నారు ఆయన అభిమానులు. ఇక మరో గుడ్ న్యూస్ ఏంటంటే షైన్ స్క్రీన్స్ నిర్మాతలు అనిల్ రావిపూడితో మరో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఇమ్మీడియట్ గా ఈ కాంబో రిపీట్ అవుతుందా? లేక టైం పడుతుందా? అన్న విషయంపై మాత్రం క్లారిటీ లేదు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు