Extra Ordinary Man : ద్యావుడా… నితిన్ సినిమాకు ఇన్ని బ్యాడ్ సెంటిమెంట్సా ? ఎక్స్ట్రా డోస్ !

యంగ్ హీరో నితిన్ కు గత కొంతకాలంగా దురదృష్టం వెంటాడుతున్నట్టుగా ఉంది. గత మూడేళ్ళ నుంచి ఈ హీరోకు సరైన హిట్ పడనేలేదు. “భీష్మ” తరువాత చెప్పుకోదగ్గ హిట్ ఒక్కటి కూడా లేదు. ప్రస్తుతం నితిన్ హీరోగా నటించిన “ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్” సినిమాపైనే ఆశలన్ని పెట్టుకున్నాడు. శ్రీలీల కథానాయికగా నటించిన ఈ కామెడీ యాక్షన్ డ్రామాకి వక్కంతం వంశీ దర్శకత్వం వహించారు. శ్రేష్ఠ్ మూవీస్, ఆదిత్య మూవీస్, ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాజశేఖర్ విలన్‌గా నటించారు. హారిస్ జయరాజ్ స్వరాలు సమకూర్చారు. ఈ మూవీ డిసెంబర్ 8న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ సినిమాను “నాని” “హాయ్ నాన్న” మూవీకి పోటీగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే నితిన్ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టాడు.

తాజాగా రిలీజైన “ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్” మూవీ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రియాక్షన్ వస్తోంది. కానీ మరోవైపు నితిన్ సినిమాను కొన్ని బ్యాడ్ లక్స్ వెంటాడుతున్నాయి. ముందుగా డైరెక్టర్ వక్కంతం వంశీ గురించి మాట్లాడుకుందాం. వక్కంతం వంశీ దర్శకుడిగా చేసిన మొదటి సినిమా ఫ్లాప్ అయ్యింది. అలాగే ఈయన ఇప్పటిదాకా తీసిన సినిమాల్లో హిట్స్ సంఖ్య చాలా తక్కువ. 2015లో వంశీ దర్శకత్వంలో వచ్చిన రేసుగుర్రం, టెంపర్ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్. ఆ తరువాత ఈయనకు అసలు హిట్ అనే మాటే తెలియకుండా పోయింది. అసలే హిట్స్ లేక సతమతం అవుతున్న నితిన్ పోయిపోయి ఇలాంటి డైరెక్టర్ చేతిలో పడ్డాడు.

నెక్స్ట్ హీరోయిన్ శ్రీలీల విషయానికొస్తే… ఆమె హీరోయిన్ గా చేసిన గత 2 సినిమాలు ‘స్కంద’, ‘ఆదికేశవ’ ఒకదాన్ని మించి మరొకటి ఫ్లాప్ అయ్యాయి. మరి ఈ సినిమాకు శ్రీలీల ఫాలోయింగ్ ఎంత వరకు ఉపయోగపడుతుందో గానీ ఐరన్ లెగ్ గా మారకుండా ఉంటే చాలు. ఇక సంగీత దర్శకుడు హారిస్ జయరాజ్ తెలుగులో పని చేసిన ఒక్క సినిమా కూడా హిట్ అవ్వలేదు. మరి ఇన్ని ఎక్స్ట్రా బ్యాడ్ సెంటిమెంట్స్ సినిమాపై ఉంటే రిలీజ్ అయ్యాక “ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్” రిజల్ట్ ఎలా ఉంటుందో? ఈ మూవీపై పడుతున్న ఎక్స్ట్రా డోస్ బ్యాడ్ లక్స్ ను “ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్” ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. ఇన్ని బ్యాడ్ సెంటిమెంట్స్ ను జయించి మూవీ ఎక్స్ ట్రా హిట్ అవుతుందా? అనేది చూడాలి. మొత్తానికి “ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్” ట్రైలర్ మాత్రం బాగానే ఉంది.

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు