Nithin’s Next: నితిన్ సినిమాలో వర్ష – హీరోయిన్ కాదు కానీ..!

నితిన్, రష్మిక హీరో హీరోయిన్లుగా డైరెక్టర్ వెంకీ కుడుముల డైరెక్షన్లో ఓ సినిమా ఇటీవలే ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సినిమా టైటిల్ తమ్ముడు అని ప్రచారంలో ఉంది కానీ, ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు. ప్రస్తుతం వక్కంతం వంశీ డైరెక్షన్లో ఎక్సట్రార్డినరీ మ్యాన్ సినిమా తర్వాత ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది సినిమా యూనిట్.

నితిన్, రష్మిక, వెంకీ కుడుముల కాంబినేషన్లో వచ్చిన భీష్మ సినిమా డీసెంట్ హిట్ అయిన నేపథ్యంలో ఈ సినిమా మీద మంచి అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాలో మరో హీరోయిన్ వర్ష బొల్లమ్మ కీలక పాత్రలో కనిపించనుందని టాక్ వినిపిస్తోంది.

మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన వర్ష ఫస్ట్ మూవీతోనే టాలీవుడ్ ఆడియెన్స్ ని ఆకట్టుకుంది. ఈ సినిమా ఓటీటీలో రిలీజయ్యి డీసెంట్ రెస్పాన్స్ అందుకున్నప్పటికీ తర్వాత చెప్పుకోదగ్గ ఆఫర్లు రాలేదు. బెల్లంకొండ గణేష్ తో కలిసి నటించిన స్వాతి ముత్యం సినిమా కూడా పర్వాలేదనిపించినా వర్షకి పెద్దగా ఉపయోగపడలేదు.

- Advertisement -

నితిన్ కూడా ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేక సతమతం అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా హిట్ అవ్వటం కీలకంగా మారింది. గతంలో వెంకీ కుడుములతో భీష్మ లాంటి డీసెంట్ హిట్ ఉన్న నేపథ్యంలో ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవుతున్నాయి. మరి, వరుస డిజాస్టర్స్ తో సతమతం అవుతున్న నితిన్ కి ఈ సినిమాతో అయినా బ్లాక్ బస్టర్ దక్కుతుందో లేదో చూడాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు