#VNRTrio: నితిన్ కొత్త సినిమాలో ఈ యంగ్ హీరోయిన్ కూడా?

నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇంతకు ముందు వీళ్ళ కాంబినేషన్ లో భీష్మ అనే మూవీ వచ్చింది. 2020 లో వచ్చిన ఆ సినిమా నితిన్ కెరియర్ లో మంచి సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు మరోసారి వీరి కాంబినేషన్ రిపీట్ అయింది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మార్చి 24 న మెగా స్టార్ చిరంజీవి చేతులమీదుగా గ్రాండ్ గా లాంచ్ అయింది. ఈ మధ్యే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయిన ఈ సినిమా 2023 నవంబర్ లేదా డిసెంబర్ నెలలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

జి.వి ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. చాలా రోజుల తర్వాత జి.వి. ప్రకాష్ మ్యూజిక్ ఇస్తున్న స్ట్రైట్ తెలుగు సినిమా ఇది.

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుండగా, ఇతర నటీనటుల వివరాలు ఇంకా బయటికి రాలేదు. తాజాగా ఈ సినిమాలో మరో హీరోయిన్ ఉందంటూ సోషల్ మీడియా లో న్యూస్ వైరల్ అయింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు కన్నడ నుంచి వచ్చిన యంగ్ బ్యూటీ శ్రీ లీల. పెళ్లి సందడి సినిమాతో పరిచయమైన ఈ హీరోయిన్ ధమాకా సినిమాతో భారీ హిట్ ని అందుకుంది. అయితే నితిన్ వెంకీ కుడుముల సినిమాలో శ్రీ లీల ఓ స్పెషల్ సాంగ్ లో యాక్ట్ చేస్తుందని, మూవీకి ఆ సాంగ్ చాలా ప్లస్ అవుతుందని సమాచారం. శ్రీ లీల ఆల్రెడీ నితిన్ తో ఓ సినిమా చేస్తుంది. తాజాగా ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపిస్తుందంటూ వార్తలు వినబడుతున్నాయి. మరి ఈ న్యూస్ ఎంత వరకు నిజమో తెలియాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు