Viraj Ashwin: అల్లు అర్జున్ వల్లే ట్రోల్స్ ఎదుర్కొన్నాను.. బేబీ హీరో సంచలన కామెంట్స్..!

Viraj Ashwin:

విరాజ్ అశ్విన్.. తెలుగు సినీ ప్రేక్షకులకు ఈ పేరుని ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. బేబీ సినిమాలో సెకండ్ హీరోగా కనిపించిన విరాజ్ అశ్విన్ అందరికీ సుపరిచితమే. థాంక్యూ బ్రదర్, మాయా పేటిక వంటి సినిమాలలో నటించినప్పటికీ.. బేబీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు విరాజ్ అశ్విన్. ఈ సినిమాలో ఇతని బోల్డ్ పర్ఫార్మెన్స్ అభిమానులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా తరువాత విరాజ్ కి వరుస ఆఫర్లు వస్తున్నాయి.

ఇదిలా ఉంటే.. ఇటీవల ఓ సందర్భంలో విరాజ్ మాట్లాడుతూ అల్లు అర్జున్ వల్ల తాను ఎక్కువగా ట్రోల్ కి గురైనట్టు చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు. విరాజ్ మాట్లాడుతూ.. “నేను ఇండస్ట్రీకి రావాలనుకుంటున్న కొత్తలో ఓ డాన్స్ మాస్టర్ దగ్గర డాన్స్ నేర్చుకున్నా. అది అల్లు అర్జున్ గారు ప్రాక్టీస్ చేసే షెడ్డు. నాకు డాన్స్ నేర్పే మాస్టారు నాతో ఇలా చెప్పేవారు. విరాజ్.. ఇక్కడికి అల్లు అర్జున్ గారు వచ్చి ఎలా కష్టపడేవారో తెలుసా..? ఉదయం 6 గంటలకు వచ్చి సాయంత్రం 6:00 వరకు ప్రాక్టీస్ చేసేవారు. ఒక్క స్టెప్ ఫర్ఫెక్ట్ గా రాకపోయినా పదేపదే ప్రాక్టీస్ చేసేవారు” అంటూ మా డాన్స్ మాస్టర్ నాతో చెప్పారని చెప్పుకొచ్చాడు విరాజ్.

ఇదే విషయాన్ని తాను బేబీ సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ గారికి చెప్పానని తెలిపారు. అయితే ఆ తరువాత అల్లు అర్జున్ స్పీచ్ ఇస్తూ.. ” మనలో ఏ టాలెంట్ ఉందనేది ముందు గుర్తించాలి. దానిమీద ఫుల్ ఫోకస్ పెట్టాలి. అప్పుడే సక్సెస్ అవుతాం. నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి దానిపైనే దృష్టి పెట్టాను. నువ్వు ఏం చేయగలవో ముందు గుర్తించు” అంటూ విరాజ్ అశ్విన్ ని ఉద్దేశిస్తూ అల్లు అర్జున్ అన్నారు. దీంతో వీరాజ్ అశ్విన్ పై గట్టిగా ట్రోలింగ్ జరిగిందట. ఈ విషయాన్ని విరాజ్ స్వయంగా చెప్పుకొచ్చారు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the

Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు