Mega 157: జగదేకవీరుడికి జోడిగా విశ్వసుందరి – కాంబినేషన్ అంటే ఇదే..!

Mega 157

ఇటీవలే భోళాశంకర్ సినిమా రూపంలో బిగ్గెస్ట్ డిజాస్టర్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి తన నెక్స్ట్ సినిమాలను లైన్లో పెట్టే పనిలో పడ్డాడు. కళ్యాణ్ కృష్ణతో కలిసి 156వ సినిమా టాక్ ఉండగా అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు, బింబిసార డైరెక్టర్ వశిష్ఠ డైరెక్షన్లో చేయబోయే 157వ సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది.

సోషియో ఫాంటసీ నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమా కథ విషయంలో ఆసక్తికర ప్రచారం కూడా జరుగుతోంది సోషల్ మీడియాలో. వేదాల ఆధారంగా ఏ సినిమా కథ ఉంటుందని, చిరంజీవి ముల్లోకాలను చుట్టి వచ్చే సీక్వెన్స్ ఉంటుందని టాక్ వినిపిస్తోంది. సినిమా టైటిల్ కూడా ముల్లోక వీరుడు అని కూడా అంటున్నారు.

త్వరలోనే షూటింగ్ స్టార్ట్ కానున్న ఈ సినిమాలో చిరు సరసన ముగ్గురు హీరోయిన్లు నటించే అవకాశం ఉండగా ఇప్పటికే మృణాల్ ఠాకూర్, అనుష్కల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. తాజాగా మరో హీరోయిన్ క్యారెక్టర్లో ఐశ్వర్య రాయ్ నటించనుందని టాక్ వినిపిస్తోంది. ఈ క్యారెక్టర్లో నటించేందుకు ఐశ్వర్య గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసిందని అంటున్నారు. ఈ టాక్ తో సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయి.

- Advertisement -

అప్పట్లో రావోయి చందమామ సినిమాలో స్పెషల్ సాంగ్ లో కనిపించటం మినహా తెలుగులో స్ట్రైట్ సినిమా చేయలేదు ఐశ్వర్య రాయ్. ఇప్పుడు చిరంజీవి సినిమాలో ఐశ్వర్య నటించనుందన్న టాక్ ఆసక్తిని పెంచుతోంది. ఆచార్య, గాడ్ ఫాదర్ లాంటి ఫ్లాప్స్ తర్వాత చిరంజీవికి వాల్తేరు వీరయ్య సినిమా రూపంలో హిట్ వచ్చినప్పటికీ తర్వాత వచ్చిన భోళాశంకర్ నిరాశ పరిచిన నేపథ్యంలో ఈ సినిమా హిట్ అవ్వటం కీలకంగా మారింది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు