Strong Buzz: సెట్స్ పై ఉన్నవి ముందు ఫినిష్ చేయండి.. అంటున్న ఫ్యాన్స్..!

Strong Buzz:

టాలీవుడ్ లో కాంబో హైప్స్ అనే అలవాటు ముందు నుండి ఉన్నదే. పలానా స్టార్ హీరో ఆ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడని వార్తలు రాగానే ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ స్టోరీ గురించి కూడా పట్టించుకోకుండా సినిమా బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్ అని ఫిక్స్ అయిపోతారు. కంటెంట్ బాగుంటే సినిమా కూడా ఆడుతుంది. లేదంటే ట్రోలర్స్ కి అడ్డంగా దొరికిపోతారు.

అయితే ఇక్కడి వరకు అన్ని ఇండస్ట్రీలో జరిగేదే అయినా, ఈ మధ్య కాంబో హైప్ పిచ్చి బాగా ఎక్కింది టాలీవుడ్ జనాలకి. ఒక సినిమా బ్లాక్ బస్టర్ కాగానే, ఆ డైరెక్టర్ పలానా ఈవెంట్ లోనో, లేక ఫంక్షన్ లో కలిస్తే, పొరపాటున వాళ్ళు కలిసి ఉన్న స్టిల్స్ వస్తే చాలు, ఈ కాంబో లో సినిమా వచ్చేస్తుందని ఆయా హీరోల ఫ్యాన్స్ గట్టిగా ఫిక్స్ అయిపోతారు. దీన్ని ఆసరా గా చేసుకుని మేమెర్స్, ట్రోలర్స్ లైక్స్ కోసం ఆ కాంబో లో ఓ రేంజ్ లో సినిమా వచ్చేస్తుందని ఊదరగొడతారు. ఇప్పుడు కూడా అలాంటి వార్త మరోటి వైరల్ అయ్యింది.

రీసెంట్ గా జైలర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ త్వరలో మెగాస్టార్ చిరంజీవి తో సినిమా చేస్తున్నాడని సోషల్ మీడియా లో స్ప్రెడ్ అయింది. ఇప్పుడు తాజాగా మరో స్టార్ హీరో అల్లు అర్జున్ తో నెల్సన్ భారీ పాన్ ఇండియా మూవీ తీస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. నిజానికి నెల్సన్ ఒకవేళ బన్నీ ని కలిసి స్టోరీ వినిపించినా, ఆ కథ నచ్చి ఓకే అయినా, సినిమా సెట్స్ మీదకి వెళ్లాలంటే మూడు నాలుగేళ్లు పడుతుంది.

- Advertisement -

ఎందుకంటే అల్లు అర్జున్ నెల్సన్ కంటే ముందు మూడు సినిమాలు చేయాల్సి ఉంది. ప్రస్తుతం సుకుమార్ తో చేస్తున్న సినిమా పుష్ప 2 తో పాటు, త్రివిక్రమ్ తో ఒక సినిమా, సందీప్ రెడ్డి వంగతో మరో సినిమా చేస్తున్నాడు. ముగ్గురికి కనీసం ఏడాది వేసుకున్న మూడు సినిమాకి మూడేళ్లు, అంటే 2026 అవుతుంది. అప్పటివరకు నెల్సన్ ఆగలేడు.
అయితే కొందరు బన్నీ ఫ్యాన్స్ మాత్రం ముందు సెట్స్ పైన ఉన్న సినిమాలు కంప్లీట్ చేయండి. వెయిట్ చేయలేకపోతున్నాం అని వాళ్ళ బాధ. ఏది ఏమైనా ఒక సూపర్ కాంబో లో సినిమా వస్తుందంటే అది రిలీజ్ అయ్యే వరకు ఫ్యాన్స్ కి టెన్షనే.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the

Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు