Mega 157: క్రేజీ కాంబో ఇక కష్టమే – మెగా ఫ్యాన్స్ కి నిరాశే..!

Mega 157

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుసగా సినిమాలను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. ఇటీవల భోళాశంకర్ సినిమాతో డిజాస్టర్ అందుకున్న చిరు, ఆ తర్వాత కళ్యాణ్ కృష్ణ, వశిష్ఠ లతో సినిమాలను లైన్లో పెట్టాడు. కళ్యాణ్ కృష్ణ సినిమా విషయంలో అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉండగా, వశిష్ఠతో చేయబోయే సినిమాను ఇటీవలే అనౌన్స్ చేశారు.

ఆ మధ్య డైరెక్టర్ సందీప్ వంగాతో మెగాస్టార్ సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి కానీ, తర్వాత ఎలాంటి అప్డేట్ లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తే, ఈ కాంబినేషన్ కార్యరూపం దాల్చటం అసాధ్యమే అని తెలుస్తోంది. ప్రస్తుతం  రన్బీర్ కపూర్ తో యానిమల్ సినిమాతో బిజీగా ఉన్నాడు సందీప్. ఈ సినిమా రిలీజయ్యాక ప్రభాస్ తో చేయబోయే స్పిరిట్ సినిమా మీద దృష్టి పెట్టనున్నాడు.

ఇప్పటికే అల్లు అర్జున్ తో ఓ సినిమా కమిట్ అయిన సందీప్, స్పిరిట్ తర్వాత బన్నీ సినిమా స్టార్ట్ చేసే అవకాశం ఉంది. మహేష్ బాబుతో కూడా సందీప్ సినిమా చేసే ఛాన్స్ ఉందని వార్తలొచ్చిన నేపథ్యంలో మహేష్, రాజమౌళి కాంబినేషన్లో రాబోయే సినిమా తర్వాత మహేష్ సందీప్ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్ట్స్ అన్నీ కంప్లీట్ అవ్వాలంటే కనీసం 2030 వరకు సమయం పట్టే అవకాశం ఉంది. ఈ లోగా మెగాస్టార్ మరో 5 లేదా 6సినిమాలు చేసి రిటైర్ అయినా అవ్వచ్చు.

- Advertisement -

సందీప్ తో మాత్రమే కాకుండా త్రివిక్రమ్ శ్రీనివాస్, పూరి జగన్నాధ్ లతో కూడా చిరంజీవి సినిమా చేసే ఛాన్స్ ఉందని ఆ మధ్య వార్తలొచ్చాయి. ప్రస్తుతం చిరు యంగ్ డైరెక్టర్స్ తో వర్క్ చేయటానికి ప్రిఫరెన్స్ ఇస్తున్న నేపథ్యంలో ఈ కాంబినేషన్స్ ఇక లేనట్లే అని చెప్పాలి. భోళాశంకర్ దెబ్బతో రీమేక్స్ కి స్వస్తి పలికిన చిరు, సీనియర్ డైరెక్టర్స్ తో వర్క్ చేస్తాడా లేదా అన్నది వేచి చూడాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు