Dil raju: ఆ స్టార్ హీరోయిన్ తో రెస్టారెంట్ లో అర్ధరాత్రి అడ్డంగా దొరికిపోయిన దిల్ రాజు..?

Dil raju

ప్రముఖ నిర్మాత దిల్ రాజు గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. డిస్ట్రిబ్యూటర్ గా మొదలుపెట్టి.. ఆ తరువాత దిల్ సినిమాతో నిర్మాతగా మారి ఆ పేరునే తన ముందు పేరుగా మార్చుకున్నాడు దిల్ రాజు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై వరుస విజయాలను అందుకుంటూ తిరుగులేని నిర్మాతగా కొనసాగుతున్నారు. ఈయన ఏ సినిమా తీసినా కలెక్షన్ల వర్షం కురుస్తూ ఇండస్ట్రీలోనే స్టార్ నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. కేవలం స్టార్ హీరోల సినిమాలే కాకుండా చిన్న హీరోల సినిమాలు కూడా ఎంకరేజ్ చేస్తూ పెట్టుబడి పెట్టి లాభాలు పొందుతున్నాడు.

అలాగే తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ్ భాషల్లోనూ సినిమాలను నిర్మిస్తున్నారు. ఈయన నిర్మాతగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 20 ఏళ్లకు పైనే అవుతుంది. ప్రస్తుతం దిల్ రాజు.. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే ఓ భారీ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఆయన వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. ఆయన మొదటి భార్య చనిపోయాక రెండో పెళ్లి చేసుకుని ఒక బాబుకు కూడా జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. అయితే మొదటి భార్య చనిపోయిన సమయంలో దిల్ రాజు ఓ స్టార్ హీరోయిన్ ని పెళ్లి చేసుకుంటారని, అంతేకాదు ఆ హీరోయిన్ తో రెస్టారెంట్ లో మీడియా కి అడ్డంగా బుక్కయ్యారనే వార్తలు కూడా వినిపించాయి.

ఆ హీరోయిన్ మరెవరో కాదు అనుష్క శెట్టి. వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని వార్తలు గతంలో చాలానే వినిపించాయి. దిల్ రాజు తన మొదటి భార్య మరణించిన అనంతరం అనుష్క శెట్టినే వివాహం చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు కూడా వైరల్ అయ్యాయి. అంతేకాదు మీడియా ప్రతినిధులు సైతం దిల్ రాజుని నేరుగా మీరు అనుష్కతో ఎఫైర్ పెట్టుకున్నారా అని ప్రశ్నించారు. ఎందుకు దిల్ రాజు స్పందిస్తూ.. అలాంటిదేమి లేదని స్పష్టం చేశారు.

- Advertisement -

ఇలా రూమర్స్ పుట్టిస్తూ పిచ్చి రాతలు రాసే వాళ్ళు ఎన్నైనా రాస్తారని.. ఆమెకి పెళ్లి కాలేదు కాబట్టి ఇలాంటి వార్తలు ఎన్నైనా రాస్తారని కౌంటర్ ఇచ్చారు. అంతేకాదు ఇలాంటి పిచ్చి ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన అవసరం కూడా తనకు లేదని అన్నారు. అనుష్కను కలిసిన సందర్భాలు కూడా తక్కువే అని.. అలాంటిది మా మధ్య ఈ రిలేషన్ ఎందుకు అంటగడుతున్నారని ఫైర్ అయ్యారు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు