Dil raju :రజనికాంత్ ని డైరెక్ట్ చేయబోతున్న టాలీవుడ్ డైరెక్టర్

రజనీకాంత్ ని డైరెక్ట్ చేయాలనీ ఆలోచన ఉండని డైరెక్టర్ ఎవరు ఉండరు కానీ అవకాశం మాత్రం కొంతమందికే వస్తుంది. అలాంటి గోల్డెన్ ఛాన్స్ మన టాలీవుడ్ డైరెక్టర్ ఒకరిని వరించింది. ప్రస్తుతం డాక్టర్ మూవీ ఫెమ్ నెల్సన్ దర్శకత్వంలో రజినీకాంత్ “జైలర్” అనే సినిమాని చేస్తున్నారు. ఈ మూవీ తరువాత రజనీకాంత్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో మూవీ చేయబోతున్నారు అనే వార్తలు వచ్చాయి. కానీ ఆ న్యూస్ పై ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. అయితే ఇప్పుడు మరో కొత్త దర్శకుడు రజనీకాంత్ ని డైరెక్ట్ చేయబోతున్నాడు అనే న్యూస్ వైరల్ అవుతుంది.

దిల్ రాజు తలపతి విజయ్ హీరోగా వచ్చిన “వారసుడు “సినిమాతో తమిళ్ ఇండస్ట్రీ కి ప్రొడ్యూసర్ గా ఎంట్రీ ఇచ్చారు. అయితే ఈ మూవీ తమిళ్ లో బ్లాక్ బస్టర్ అవడంతో దిల్ రాజు మరో తమిళ్ లో చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈసారి దిల్ రాజు ఒక మెట్టు పైకి ఎక్కి ఏకంగా రజనీకాంత్ తోనే సినిమా ప్లాన్ చేయడానికి చూస్తున్నరంట

అయితే ఇది పెద్దగా ఆశ్చర్య పోవాల్సిన విషయమేం కాదు ఎందుకంటే తమిళ్ డైరెక్టర్ లు తెలుగు హీరో లతో సినిమాలు చేయడం , తెలుగు డైరెక్టర్ లు తమిళ్ హీరో లతో సినిమాలు చేయడం ఈ మధ్య సర్వసాధారణం అయిపొయింది. రీసెంట్ గా ఇలాంటి కాంబినేషలో వచ్చిన సినిమాలే ప్రిన్స్ , సార్ , ప్రస్తుతం వెంకట్ ప్రభు అనే తమిళ్ డైరెక్టర్ నాగ చైతన్య తో ” కస్టడీ “అనే మూవీ ని చేస్తున్నారు ,ధనుష్ కూడా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఒక మూవీ చేయబోతున్నారు.అయితే మరి రజనీకాంత్ డైరెక్ట్ చేయబోయే ఆ తెలుగు దర్శకుడు ఎవరో తెల్సా వంశీ పైడిపల్లి.

- Advertisement -

అవును వంశీ పైడిపల్లి , దిల్ రాజుమరొక సినిమా చేయడానికి కోలాబిరేట్ అవుతున్నారు. ఇప్పటికే కథ సిద్ధం చేసిన వంశీ , రజనికాంత్ అపాయిన్మెంట్ కోసం చూస్తున్నారంట.మరి వంశీ పైడిపల్లి కథ కి రజని ఒకే చెప్తారో లేక సింపుల్ గా నో చెప్తారో చూడాలి

 

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు