Dil Raju: దిల్ రాజుకు ఏమైంది – ఆ వ్యాఖ్యలకు కారణం..?

ప్రొడ్యూసర్ గా ఇటీవలే 20ఏళ్ళు పూర్తి చేసుకున్న దిల్ రాజు తాజాగా బలగం సినిమా ఇచ్చిన సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం శాకుంతలం సినిమా ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉన్న దిల్ రాజు వరుసగా సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఆ మధ్య కటౌట్ ని కాదు కాదని నమ్ముకొని సినిమాలు తీయండి అంటూ ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రవచనాలు పలికిన దిల్ రాజు తాజాగా నిర్మాతలు స్టార్ హీరోల భజన చేయాల్సిందే అంటూ స్టేట్మెంట్ ఇచ్చి అందరిని షాక్ కి గురి చేశారు. నిర్మాతలు స్టార్ హీరోల భజన చేయటం ఎప్పటి నుంచో ఉన్న అలవాటు అని. స్టార్ హీరోలపై నిర్మాతలు కోట్లకు కోట్లు పెట్టుబడి పెడతారు కాబట్టి వాళ్లని బంగారు బాతులాగా చూసుకుంటారని చెప్పుకొచ్చారు.

స్టార్ హీరోల భజన చేస్తేనే ఇండస్ట్రీలో నిలదొక్కుకునే పరిస్థితి ఉందన్న దిల్ రాజు. ఏ భాషల్లో అయినా స్టార్ హీరోలే స్టార్స్ అని, మార్నింగ్ షోలు నిండాలంటే వారి ఇమేజ్ వల్లనే సాధ్యం అని అన్నారు. ప్రస్తుతం కేవలం హీరో ఇమేజ్ తో మాత్రమే సినిమాలు ఆడే రోజులు లేవన్నారు. హీరో ఇమేజ్ వల్ల రెండు, మూడు వరాలు మాత్రమే థియేటర్లలో సినిమా ఆడుతుందని, అంతకు మించి ఆడాలంటే సినిమాలో కంటెంట్ ముఖ్యమని అన్నారు. అయితే కొన్ని రోజుల కిందట కథని నమ్ముకొని మాత్రమే సినిమా తీయాలన్న దిల్ రాజు ఇప్పుడు ఇలా స్టార్ హీరోల భజన చేయటం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

ప్రస్తుతం శాకుంతలం ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న దిల్ రాజు ఆ సినిమా ప్రీమియర్ షో తర్వాత ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ రిలీజ్ కు నాలుగు రోజుల ముందే ప్రీమియర్స్ వేయటానికి కారణం చెప్పుకొచ్చారు. తాను నిదానంగా హాలీవుడ్ నిర్మాతల పద్ధతులు అలవర్చుకుంటున్నానని అన్నారు. హాలీవుడ్ లో కూడా రిలీజ్ కి ముందే పలు చోట్ల ప్రీమియర్ షోలు వేస్తారని, శాకుంతలం సినిమా విషయంలో తాను కూడా అదే పద్ధతి ఫాలో అవుతున్నా అని అన్నారు. అయితే దిల్ రాజు స్టార్ హీరోల గురించి ఇచ్చిన స్టేట్మెంట్ కి, హాలీవుడ్ తరహాలో వెళ్ళబోతున్నా అంటూ ఇచ్చిన స్టేట్మెంట్ కి పొంతన లేదు. దీంతో దిల్ రాజు వ్యాఖ్యల వెనకున్న ఆంతర్యం ఏమిటో అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు