Nithin: మళ్ళీ పవనాస్త్రం వాడబోతున్న నితిన్ – వర్కౌట్ అవుతుందా..?

యంగ్ హీరో నితిన్ సరైన హిట్ లేక సతమతం అవుతున్నాడు. కెరీర్ తొలినాళ్లలో వరుస హిట్స్ తో దూసుకుపోయిన నితిన్, కొంత కాలం పాటు వరుస ఫ్లాప్స్ తో ఇబ్బంది పడ్డాడు. ఆ సమయంలో ఇష్క్ సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ కు పవన్ కళ్యాణ్ హాజరయ్యి తన సపోర్ట్ అందించటంతో మళ్ళీ ఆ సినిమాతో హిట్ అందుకున్నాడు నితిన్. ఇక అప్పటి నుండి పవన్ ఫ్యాన్స్ నితిన్ ప్రతి సినిమాకు సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. ఇష్క్ తర్వాత గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలో పవన్ కళ్యాణ్ హిట్ సాంగ్ ని రీమిక్స్ చేసి హిట్ కొట్టాడు. అయితే ఆ రెండు సినిమాలకు హెల్ప్ అయిన పవన్ రెఫరెన్స్ ఆ తర్వాత సినిమాల్లో కవుత్తదనం లేకపోవటంతో కథ మళ్ళీ మొదటికి వచ్చింది.

గత చిత్రం మాచర్ల నియోజకవర్గం తర్వాత వక్కంతం వంశీ దర్శకత్వంలో నటిస్తున్న నితిన్, ఆ సినిమాలో మళ్ళీ పవన్ రెఫరెన్స్ వడబోతున్నాడని టాక్ వినిపిస్తోంది. వివరాల్లోకి వెళితే, నెక్స్ట్ సినిమాలో జూనియర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్ చేస్తున్న నితిన్ కథకు అనుగుణంగా పవన్ కళ్యాణ్ క్యామియో గానీ, ఎదో ఒక సీన్లో పవన్ కళ్యాణ్ రెఫరెన్స్ గానీ వాడుకునే ఆలోచనలో ఉన్నాడట. ఇదే గనక నిజం అయితే నితిన్ కు పవన్ కళ్యాణ్ వల్ల మరో హిట్ అందుతుందని అంటున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ ను క్యామియో రోల్ కు ఒప్పించటం నితిన్ కు పెద్ద కష్టం కూడా కాకపోవచ్చు. ఎందుకంటే, పవన్ కళ్యాణ్ కు నితిన్ వీరాభిమాని అవ్వటం, గతంలో పలుమార్లు పవన్ కళ్యాణ్ కూడా నితిన్ కి తన సపోర్ట్ అందించటం ఇందుకు కారణం.

ఇంకా టైటిల్ అనౌన్స్ చేయని ఈ సినిమాకు జూనియర్, సైతాన్ వంటి పేర్లను పరిశీలిస్తున్నారట. అయితే గతంలో తనకు కావాల్సిన బూస్టప్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ రెఫరెన్స్ ను మళ్ళీ వాడుకుంటున్న నితిన్ ఈ సారి కూడా హిట్ కొడతాడా లేదా అన్నది వేచి చూడాలి. టైటిల్ త్వరలోనే అనౌన్స్ చేయనున్న ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ రెఫరెన్స్ గురించి కూడా అనౌన్స్ చేస్తే సినిమా బిజినెస్ కి మంచి హెల్ప్ అయ్యే అవకాశం ఉంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు