Balakrishna: అఖండ 2 ఎలక్షన్స్ కోసమేనా..?

బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన అఖండ సినిమా సృష్టించిన సంచలనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ మార్కెట్ రేంజ్ పెరిగింది అనటంలో అతిశయోక్తి లేదు. ఈ సినిమాకు సీక్వెల్ ఉండబోతుందని అప్పట్లో వార్తలొచ్చినప్పటికీ, అధికారికంగా అయితే ఎలాంటి ప్రకటన రాలేదు. ఇటీవల సంగీత దర్శకుడు థమన్ “అఖండ 2తో కలుద్దాం” అంటూ ట్వీట్ చేయటంతో ఈ సినిమాపై క్లారిటీ వచ్చేసింది. అయితే తాజాగా వినిపిస్తున్న కథనం సినిమాపై అంచనాలను మరింత పెంచేలా ఉంది. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్న బాలకృష్ణ, ఆ సినిమా తర్వాత అఖండ 2 సినిమాను ప్రారంభించబోతున్నారని సమాచారం.

ఎన్నికల సమయంలో రాబోతున్న ఈ సినిమాలో పొలిటికల్ టచ్ కాస్త ఎక్కువగా ఉండబోతుంది అన్నది సమాచారం. ఈ సినిమా తమ పార్టీ ప్రచారానికి హెల్ప్ అయ్యేలా ఉండాలని స్వయంగా బాలకృష్ణ కోరినట్టు సమాచారం. పార్ట్ 1లో కూడా అడపాదడప పొలిటికల్ డైలాగ్స్ అప్పట్లో పెద్ద దుమారమే లేపాయి. మరి ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయ్యే సమయానికి ఎలక్షన్ హీట్ పెరగనుండటం, పైగా పొలిటికల్ టచ్ ఎక్కువగా ఉండబోతుందన్న టాక్ తో అంచనాలు భారీ స్థాయిలోనే ఏర్పడుతున్నాయి. అంతే కాకుండా అఖండ 2లో కూడా బాలయ్య డ్యుయల్ రోల్ చేయనున్నారని, రెండు క్యారెక్టర్స్ కి బాడీ లాంగ్వేజ్ పరంగా చాలా వత్యాసం ఉండండని సమాచారం.

తన సినిమాల్లో రాజకీయాలకు సంబందించిన అంశాలు జోడించడం బాలయ్యకు కొత్తేమి కాదు. గతంలో లెజెండ్, అధినాయకుడు సినిమాల్లో రాజకీయ నేపధ్యాన్ని వాడుకున్నారు. 2014ఎన్నికల సమయంలో వచ్చిన లెజెండ్ సినిమా బాలకృష్ణకు, టీడీపీ పార్టీకి పొలిటికల్ కాంపెయినింగ్ గా కాస్తో కూస్తో ఉపయోగపడిందని చెప్పాలి. అఖండ 2లో కూడా పొలిటికల్ టచ్ ఉన్నది నిజమే అయితే అది బాలకృష్ణకు ఎంతవరకు హెల్ప్ అవుతుందో సినిమా రిలీజ్ వరకు వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు