Gunasekhar: గుణశేఖర్ ఇకనైనా రూటు మారుస్తాడా..?

డైరెక్టర్ గుణశేఖర్ అనగానే భారీతనం, వైవిధ్యం గుర్తుకొస్తాయి. లాఠీ సినిమా ద్వారా 1992లో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన గుణశేఖర్,ఆ తర్వాత ఒక సినిమాకు మరో సినిమాకు సంబంధం లేకుండా డిఫరెంట్ సబ్జక్ట్స్ తో సినిమాలు తీస్తూ అనతి కాలంలోనే స్టార్ డైరెక్టర్ రేంజ్ కి ఎదిగాడు. తీసిన తొలి మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించకపోయినా రెండు నేషనల్ అవార్డులు, ఒక నంది అవార్డు అందుకొని తన సత్తా చాటాడు. అయితే ఎన్టీఆర్ తో బాలరామాయణం లాంటి పౌరాణిక నేపథ్యం ఉన్న కథతో చిన్న పిల్లలతో సినిమా తీసిన గుణశేఖర్ తరువాత చిరంజీవి లాంటి స్టార్ హీరోతో సినిమా చేసే అవకాశం అందుకోవటమే కాకుండా సూపర్ హిట్ ఇచ్చి అందరిని ఆశ్చర్యానికి గురి చేశాడు.

చూడాలని ఉంది సినిమాతో సూపర్ హిట్ ఇచ్చిన గుణశేఖర్ తర్వాత చిరంజీవితో  తీసిన మృగరాజు సినిమాతో అంతగా మెప్పించలేకపోయాడు. ఆ తర్వాత మహేష్ బాబుతో ఒక్కడు, అర్జున్ వంటి వరుస బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన గుణశేఖర్ సైనికుడు ఆశించిన స్థాయిలో హిట్ ఇవ్వలేకపోయాడు. మహేష్, చిరంజీవితో మాత్రమే కాకుండా అల్లు అర్జున్ తో తన కాంబినేషన్ రిపీట్ చేసినప్పటికీ ఆశించిన ఫలితం దక్కలేదు. సైనికుడు సినిమా తర్వాత నుండి సరైన హిట్ లేక సతమతం అవుతున్నాడు గుణశేఖర్. ఆ మధ్య రుద్రమదేవి సినిమాతో గట్టిగా ప్రయత్నించినప్పటికీ పెద్దగా ఫలితం లేకపోయింది.

ప్రస్తుతం శాకుంతలం సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు గుణశేఖర్, 70కోట్ల బుడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా లేడి ఓరియెంటెడ్ సెగ్న్మెంట్ లోనే అత్యధిక బుడ్జెట్ తో రాబోతున్న సినిమాగా నిలిచింది. ఈ సినిమా హిట్ అవ్వటం గుణశేఖర్ తో పాటు సమంతకు కీలకంగా మారింది. అయితే గుణశేఖర్ గత కొద్దీ కాలంగా తన మార్క్ సినిమాలకు దూరంగా ఉంటూ వస్తుండటం గమనార్హం. స్టార్ హీరోలతో బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్స్ ఈ ఇచ్చిన ఈ వర్సటైల్ డైరెక్టర్ ఇకనైనా ట్రాక్ మార్చి తన మార్క్ వైవిద్యం ఉన్న సినిమాలు తీసి మళ్ళీ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని ఆశిద్దాం.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు