Dil Raju: దిల్ రాజు జడ్జిమెంట్ తప్పయ్యిందా..? 

డిస్ట్రిబ్యూషన్ రంగంలో సక్సెస్ అయ్యి ఆ తర్వాత నిర్మాతగా మారిన దిల్ రాజు వరుస హిట్స్ అందుకొని ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసాడు. దిల్ రాజు వరుస విజయాలకు కారణం కథల పట్ల అతనికి ఉన్న జడ్జిమెంట్ స్కిల్ అని అంటుంటారు. దిల్, బొమ్మరిల్లు, హ్యాపీడేస్, కొత్తబంగారు లోకం వంటి ఎన్నో ట్రెండ్ సెట్టింగ్ సినిమాలు నిర్మించిన దిల్ రాజు అనతి కాలంలోనే టాలీవుడ్ అగ్ర నిర్మాతగా ఎదిగారు. ఇటీవల బలగం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకొని మరోసారి తన సత్తా చాటాడు. అయితే తర్వాత గుణశేఖర్ తో కలిసి నిర్మించిన శాకుంతలం, నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూషన్ చేసిన ఏజెంట్ సినిమా డిజాస్టర్స్ అయ్యి దిల్ రాజుకి పెద్ద షాక్ ఇచ్చాయి.

బలగం సినిమా బ్లాక్ బస్టర్ అయిన ఆనందంలో అప్పట్లో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు దిల్ రాజు. ఇప్పుడు ఆ వ్యాఖ్యలను టార్గెట్ చేస్తూ దిల్ రాజుని విమర్శిస్తున్నారు నెటిజన్స్. కథని నమ్ముకొని సినిమా తీస్తే కచ్చితంగా హిట్ అవుతుందని, హీరోలను మాత్రమే నమ్ముకుంటే హిట్స్ రావని ప్రెస్ మీట్ పెట్టి మరీ హితబోధ చేశాడు. ప్రస్తుతం శాకుంతలం, ఏజెంట్ బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ అవ్వటంతో గతంలో దిల్ రాజు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.

దర్శకుడు గుణశేఖర్ కి, హీరోయిన్ సమంత కి హిట్ కీలకమైన దశలో వచ్చిన శాకుంతలం అవటానికి డిజాస్టర్ కారణం గుణశేఖర్ టేకింగ్ లో లోపాలే అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఏజెంట్ కూడా అఖిల్ కి హిట్ కీలకమైన దశలో విడుదలైంది. ఎన్నో అంచనాలు పెట్టుకొని రెండేళ్లకు పైగా సిక్స్ ప్యాక్ మెయింటైన్ చేసి అఖిల్ పడ్డ కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరే అయ్యింది. ఏజెంట్ ఫెయిల్యూర్ కి కూడా అన్ని వేళ్ళు దర్శకుడు సురేందర్ రెడ్డి వైపే చూపిస్తుండటం గమనార్హం.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు