Mallareddy: మహేష్ బాబు మూవీ చూసి మంత్రినయ్యా – మల్లారెడ్డి

నిన్నటి రోజున డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ రణబీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన యానిమల్ సినిమా కి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్గా హైదరాబాదులో మల్లారెడ్డి యూనివర్సిటీలో జరగడం జరిగింది. తెలంగాణలో ఎక్కడ చూసినా వినిపిస్తున్న పేరు మల్లారెడ్డి.. ఈ పేరు తరచూ ఎక్కువగా వినిపిస్తూనే ఉంటుంది. యానిమల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్లుగా మహేష్ బాబు రాజమౌళి తోపాటు మంత్రి మల్లారెడ్డి కూడా స్పెషల్ గెస్ట్ గా హాజరు కావడం జరిగింది.

యాక్షన్ ఎంటర్టైన్మెంట్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ . ఈ సినిమా డిసెంబర్ ఒకటవ తేదీన ఏకంగా ఐదు భాషలలో చాలా గ్రాండ్గా రిలీజ్ చేయబోతున్నారు. ఇందులో అనిల్ కపూర్, బాబి డియోల్ కూడా కీలకమైన పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. T- సిరీస్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తోనే నిర్మించారు. అయితే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్, పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమా ఖచ్చితంగా బాలీవుడ్లో సరికొత్త రికార్డులను సైతం సృష్టిస్తుందని అభిమానుల సైతం ధీమాతో ఉన్నారు.

యానిమల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజమౌళి, మహేష్ బాబు మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత మల్లారెడ్డి కూడా మాట్లాడుతూ.. ఈరోజు మల్లారెడ్డి యూనివర్సిటీకి యానిమల్ చిత్ర బృందం వచ్చింది. మహేష్ బాబు గారిని చూడడం చాలా ఆనందంగా అనిపించింది అంటూ తెలిపారు.. ముఖ్యంగా మహేష్ నటించిన బిజినెస్ మ్యాన్ సినిమాను చూసే తాను రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చానని.. ఆ సినిమాను పదిసార్లు చూసి ఎంపీ అయ్యానని తెలిపారు.

- Advertisement -

తాను కూడా సేమ్ మోడల్ సేమ్ సిస్టమ్ ..రణబీర్ నీకు నేనొక విషయం చెబుతా.. అప్పట్లో నేను చెప్పాను బాలీవుడ్ , హాలీవుడ్ ను తెలుగు హీరోలే రూల్ చేస్తారని మా తెలుగు వాళ్లు కూడా పెద్ద స్టార్లు అవుతారని చెప్పాను.. రాజమౌళి, దిల్ రాజు, ఇప్పుడు సందీప్ కూడా వచ్చేసారని తెలిపారు.. హాలీవుడ్, బాలీవుడ్ లో కూడా హిందుస్తాన్ రూల్ చేస్తుంది అంటూ తెలియజేయడం జరిగింది.. హైదరాబాద్ ప్రజలు మా తెలుగు ప్రజలు కూడా చాలా స్మార్ట్ అని.. పుష్ప తో అల్లు అర్జున్ దుమ్ము లేపేసారు.. ఇప్పుడు సందీప్ మరొకసారి బాలీవుడ్ లో దుమ్ము రేపడానికి సిద్ధంగా ఉన్నారంటూ తెలిపారు. ఇప్పుడు ఈ సినిమా తెలుగు నుంచి విడుదలైన ఖచ్చితంగా రూ.500 కోట్లు వస్తాయని ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అంటూ ముగించేశారు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు