Animal Movie: నా జీవితంలో భయపడేది ఆ ముగ్గురికే – రణబీర్ కపూర్

ప్రముఖ బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. బ్రహ్మాస్త్రం సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా పలుకరించిన ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ప్రస్తుతం అర్జున్ రెడ్డి లాంటి సినిమా తీసిన సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో యానిమల్ సినిమాతో మరొకసారి తెలుగు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యారు. డిసెంబర్ 1న విడుదల కానున్న ఈ సినిమా ట్రైలర్ ఈ మధ్యనే విడుదలయి సెన్సేషన్ క్రియేట్ చేసింది.

విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ జోరుగా చేపట్టారు చిత్ర బృందం. అందులో భాగంగానే హైదరాబాదులో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిన్న ఘనంగా నిర్వహించారు చిత్రబృందం. ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథులుగా సూపర్ స్టార్ మహేష్ బాబు తో పాటు స్టార్ డైరెక్టర్ రాజమౌళి హాజరయ్యారు. ఇకపోతే రణబీర్ కపూర్ ఈవెంట్ లో చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

రణబీర్ కపూర్ మాట్లాడుతూ ముందుగా అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ తన స్పీచ్ మొదలుపెట్టారు. ఇక రణబీర్ కపూర్ మహేష్ బాబు దగ్గరికి రాగానే జై బాబు అంటూ చెప్పడంతో ప్రాంగణమంతా అరుపులు, కేకలతో మారుమ్రోగిపోయింది . ఆ తర్వాత తాను కలసిన మొదటి సూపర్ స్టార్ హీరో మహేష్ బాబు అని చెప్పిన రణబీర్ కపూర్.. మహేష్ బాబు నటించిన ఒక్కడు సినిమాను తాను చూసానని.. ఈ సినిమా చూసిన తర్వాతే మహేష్ బాబుకు పెద్ద ఫ్యాన్ అయిపోయానని అంతేకాదు ఇదే విషయాన్ని చెబుతూ మహేష్ బాబుకు మెసేజ్ పెట్టగా ఆయన కూడా తనకు రిప్లై ఇవ్వడం మరింత ఆనందాన్ని కలిగించిందని రణబీర్ కపూర్ చెప్పుకొచ్చారు.

- Advertisement -

ఇక తర్వాత సుమా రణబీర్ కపూర్ ను కొన్ని ఫన్నీ ప్రశ్నలు అడగడం మొదలు పెట్టింది. మొదటగా తాను ఎక్కువ భయపడేది ఎవరికీ అని అడుగుతూ.. మూడు ఆప్షన్లను ఇచ్చింది సుమ. అయితే తాను ఇచ్చిన మూడు ఆప్షన్ లలో కూడా భార్య అనే పదాన్ని మూడు ఇతర భాషలలో తెలిపింది. వైఫ్.. భార్య..పత్ని ఇలా ఈ ముగ్గురిలో ఎవరికి భయపడతారు అంటే ఆయన తమాషాగా ముగ్గురికి భయపడతాను అంటూ తెలిపారు.

ఇకపోతే రణబీర్ కపూర్ భార్య ప్రముఖ హీరోయిన్ ఆలియా భట్ అన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ మధ్యనే పండంటి ఆడపిల్లకు కూడా జన్మనిచ్చారు. మొత్తానికైతే తన భార్య ఆలియా కు తాను భయపడతానని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు..
Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు