Life style : క్లాసీ పీపుల్ పబ్లిక్ ముందు ఈ విషయాలు అస్సలు బయటపెట్టరు

క్లాస్ గా కనిపించాలనీ, అలా ఉండాలని ఎంతోమంది కోరుకుంటారు. కానీ వాళ్ళలా ఉండడం అందరికీ సాధ్యం కాదు. ముఖ్యంగా వాళ్లకు హై లెవెల్ సోషల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఇతరులను ఇబ్బంది పెట్టరు. అలాగే ఎదుటి వారిని తక్కువ చేసే విషయాలను మాట్లాడరు. తమ ఇంటిగ్రిటీని ఇతరులు ప్రశ్నించే దాకా పరిస్థితిని తీసుకురారు. ఇలాంటి వాటికి కారణమయ్యే విషయాలలో, పబ్లిక్ లో తమ గురించి పంచుకునే విషయాలపై క్లాస్ పీపుల్ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉంటారు. ఆన్లైన్ అయినా, ఆఫ్లైన్ అయినా తాము ఏం షేర్ చేస్తున్నామనే విషయంపై ఆచితూచి ఆలోచించి ముందడుగు వేస్తారు. ముఖ్యంగా బహిరంగంగా వాళ్లు ఎవరితోనూ షేర్ చేసుకోని ఆ సీక్రెట్స్ ఏంటి? అనే వివరాల్లోకి వెళితే…

1. శత్రువులు
చాలామంది వ్యక్తులు తమ శత్రువులపై పగ తీర్చుకోవడానికి ఎలాంటి చిన్న అవకాశం దొరికినా వదిలిపెట్టరు. కానీ క్లాస్ పీపుల్ అలా కాదు. వాళ్ల శత్రువుల గురించి బయట ఎక్కడా చెడుగా మాట్లాడరు. అంటే శత్రువులను ఓడించే లేదా నాశనం చేసే శక్తి వాళ్లకు లేక కాదు. ఒకవేళ మరీ అంతగా తమ శత్రువుల గురించి మాట్లాడాల్సి వస్తే క్లాస్ పీపుల్ పర్సనల్ గా తీసుకుంటారు. తాము బాగా నమ్మే అతికొద్ది మంది వ్యక్తులతో మాత్రమే దాని గురించి మాట్లాడుతారు. ఇక్కడ విషయం ఏమిటంటే క్లాస్ పీపుల్ తమ శత్రువులపై శక్తిని వేస్ట్ చేయరు. ఎందుకంటే అంతకంటే ముఖ్యమైన పనులు ఎన్నో ఉన్నాయని భావిస్తారు.

2. బ్యాంకులో ఎంత డబ్బు ఉంది?
క్లాస్ పీపుల్ తాము ఎంత సంపాదిస్తున్నాము అనే విషయంపై పొరపాటున కూడా నోరు తెరవరు. ముఖ్యంగా తాము మాట్లాడే వ్యక్తుల కంటే ఎక్కువగా సంపాదిస్తున్నప్పటికీ. ఎందుకంటే అది ఇతరులకు అసౌకర్యంగా అనిపించే అవకాశం ఉంటుంది. అంతేకాదు తమ కంటే తక్కువగా సంపాదిస్తున్న వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు డబ్బు గురించి మాట్లాడితే గొప్పలు చెప్పుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి వాళ్లు ఎంత ధనవంతులు అనే ఒక ఉపయోగం లేని విషయం గురించి మాట్లాడటం కంటే, అవతల వాళ్ళు మాట్లాడ్డానికి ఇష్టపడే ఇతర విషయాలపై కాన్సెంట్రేట్ చేస్తారు.

- Advertisement -

3. ఖరీదైన వాచ్
క్లాస్ పీపుల్ అనగానే ధనవంతులుగా, సోఫిస్టికేటెడ్ (అధునాతనం)గా ఉండడం కాదు. నిజానికి క్లాస్ గా ఉండే వ్యక్తులు తాము ఎంత ధనవంతులం అనే విషయాన్ని ప్రపంచానికి చెప్పరు. అత్యంత ఖరీదైన రోలెక్స్ వాచ్ ధరిస్తారు. కానీ దానికి ధర ఎంత అనేది ఎవరికి చెప్పరు. కొన్నిసార్లు అయితే ఖరీదైన అవుట్ ఫిట్ ధరించడానికి కూడా సిగ్గుపడతారు. ఎందుకంటే అతిగా చేస్తున్న ఫీలింగ్ కలుగుతుంది.

4. లైంగిక జీవితం గురించి…
కొంతమంది లైంగిక జీవితం గురించి బయట ఈజీగా మాట్లాడేస్తూ ఉంటారు. కానీ క్లాస్ పీపుల్ మాత్రం ఓపెన్ మైండెడ్, సరదాగా ఉండే వ్యక్తులతో మాట్లాడుతున్నప్పటికీ తమ సెక్స్ జీవితాన్ని ప్రైవేట్ గానే ఉంచుకుంటారు. ఇలా చేయడం వల్ల తమ పార్ట్నర్స్ ను గౌరవిస్తారన్నమాట.

5. స్నేహితుల రహస్యాలు.
క్లాస్ వుమెన్ ఇంటిగ్రిటీనీ (చిత్తశుద్ధి) కలిగి ఉంటారు. ఏ విషయంలో అయినా సరే ప్రామిస్ చేశారంటే తమ మాటను నిలబెట్టుకుని తీరుతారు. ఒకవేళ తాగేసి ఉన్నప్పటికీ తమ స్నేహితుల రహస్యాలను ఎప్పటికీ బయటపెట్టారు. ముఖ్యంగా వాళ్లు గాసిప్ లను ద్వేషిస్తారు.

6. కుటుంబ రహస్యాలు
తమ కుటుంబ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ఎలాంటి విషయాన్ని కూడా క్లాస్ పీపుల్ బయటకు చెప్పుకోరు. ఎందుకంటే అది కుటుంబానికి హాని చేస్తుందన్న విషయం వాళ్లకు బాగా తెలుసు.

7. అల్ట్రా ఫేమస్ రిలేటివ్స్
క్లాస్ పీపుల్ తమ అల్ట్రా ఫేమస్ రిలేటివ్స్ గురించి ఎవరికీ చెప్పరు. ఒకవేళ స్వయంగా ప్రధాని మోడీనే తమకు దగ్గర బంధువు అయినప్పటికీ ఆ విషయాన్ని అసలు బయట పెట్టరు. ఫ్రెండ్స్ స్నేహితుల గురించి గర్వపడతారు. కానీ దాన్ని పర్సనల్ గానే ఉంచుకుంటారు.

8. వ్యక్తిగత సమస్యలు
చాలామంది సమస్యలను ఇతరులతో పంచుకోవడం వల్ల జెన్యూన్ గా ఉన్నామని అనుకుంటారు. కానీ క్లాస్ పీపుల్ మాత్రం వ్యక్తిగత సమస్యలను ఎవరికీ తెలియకుండా మేనేజ్ చేసుకుంటారు. తన కుటుంబానికి, స్నేహితులకు మాత్రమే తెలిసే అవకాశం ఉంటుంది.

9. క్లాస్ పీపుల్ మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటారు. ప్రత్యేకించి పబ్లిక్ లో ఉన్నప్పుడు. ఇతరులను కించపరచడానికి అస్సలు ఇష్టపడరు.

10. పొగడ్తలకు దూరం
క్లాస్ పీపుల్ తమను తామును ప్రశంసించుకోవడం లేదా లైమ్ లైట్ లో ఉంచుకోవడం వంటివి చేయరు. ఎంత ఎదిగినా సరే ఒదిగి ఉండడానికే తమ శాయాశక్తులా ప్రయత్నిస్తారు. వాళ్లు తమ గురించి మాట్లాడటం కంటే ఎదుటి వ్యక్తుల గురించి వినడానికే ఎక్కువగా ఇష్టపడతారు. క్లాస్ పీపుల్ బహిరంగంగా తక్కువగా మాట్లాడడానికి ఇదే కారణం.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు