Vijay Devarakonda : రౌడీ హీరోను డిజప్పాయింట్ చేసిన సుకుమార్

లెక్కల మాస్టర్ సుకుమార్ లెక్కలు మారిపోయాయి ఇప్పుడు. దీంతో విజయ్ దేవరకొండకు డిసప్పాయింట్మెంట్ తప్పలేదు. ఇప్పటిదాకా త్వరలోనే సుక్కూ, విజయ్ కాంబోలో సినిమా ఉంటుందని ఆశిస్తున్న రౌడీ హీరో అభిమానులకు షాక్ ఇచ్చే డెసిషన్ తీసుకున్నారు డైరెక్టర్ సుకుమార్. విజయ్ దేవరకొండ ను పక్కన పెట్టేసి, నెక్స్ట్ మూవీని రాంచరణ్ తో చేయబోతున్నాడు.

రౌడీ హీరోతో ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయినట్టేనా?

చాలా కాలం క్రితమే విజయ్ దేవరకొండ, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఒక మూవీని అనౌన్స్ చేశారు. కానీ అది ఇప్పటిదాకా ఇంకా కార్యరూపం దాల్చలేదు. వీరిద్దరి కాంబో పట్టాలెక్కితే వండర్స్ క్రియేట్ అవ్వడం ఖాయమని రౌడీ హీరో అభిమానులు అంచనా వేశారు. కానీ తాజాగా సుకుమార్ తీసుకున్న నిర్ణయం విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. నిజానికి సుకుమార్ లాంటి టాప్ డైరెక్టర్ తో సినిమా చేయడం అనేది మిడిల్ రేంజ్ హీరోలకి ఒక కల అని చెప్పొచ్చు. కానీ ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే విజయ్ దేవరకొండ విషయంలో ఆ కల నెరవేరడానికి చాలా కాలమే పట్టేలా కనిపిస్తోంది. ప్రస్తుతం “పుష్ప 2” మూవీతో బిజీగా ఉన్న సుకుమార్, నెక్స్ట్ మూవీని మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో పట్టాలెక్కించడానికి రెడీ అవుతున్నారు. గతంలో వీళ్లిద్దరి కాంబోలో రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ కాంబో రిపీట్ అయితే బాగుంటుందని మెగా ఫాన్స్ కలలు కంటున్నారు. ఎట్టకేలకు వీళ్ళ కల మాత్రం నెరవేరే సమయం ఆసన్నమైంది.

- Advertisement -

విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు మింగుడు పడనిది ఇదే…

పుష్ప మూవీతో దాదాపు నాలుగేళ్లుగా ఒకే మూవీకి లాక్ అయిపోయారు సుకుమార్. అయితే ఈ మూవీ ఫలితంగా ఆయన బ్రాండ్ ఇమేజ్ పాన్ ఇండియా రేంజ్ కు ఎదిగింది. ఇప్పుడు దాన్ని పాన్ వరల్డ్ గా మార్చుకోవడానికి సుకుమార్ లెక్కలు వేయడం మొదలుపెట్టారు. అందులో భాగంగానే రామ్ చరణ్ తో నెక్స్ట్ మూవీ చేయడానికి రెడీ అయ్యారు. ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ గా మంచి క్రేజ్ ను సొంతం చేసుకున్న చెర్రీతో పాన్ వరల్డ్ దిశగా ఇద్దరూ అడుగులు వేయబోతున్నారు. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న చెర్రీ, సుక్కు కాంబోలో రాబోతున్న మూవీ అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతోంది. ఇదే ఇప్పుడు విజయ్ దేవరకొండ అభిమానులకు మింగుడు పడడం లేదు.

ఐదేళ్లు వెయిట్ చేయాల్సిందేనా?

ప్రస్తుతం సుకుమార్ పుష్ప 2 మూవీతో బిజీగా ఉన్నారు. ఇక చెర్రీ కూడా గేమ్ చేంజర్ మూవీని ఇంకా పూర్తి చేయాల్సి ఉంది. ఆ తర్వాత బుచ్చిబాబు ప్రాజెక్ట్ ను కమిట్ అయ్యారు. ఆ తర్వాతే సుకుమార్ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుంది. ఇక సుకుమార్ పుష్ప 2, 3 భాగాలు, ఇటు చెర్రీతో మూవీ పూర్తి చేయడానికి మరో నాలుగేళ్లు సమయం తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ మూవీ చేస్తున్నాడు. ఆ తర్వాత గౌతమ్ తిన్ననూరితో ఓ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాల్సి ఉంది. ఆ తర్వాత మరో ఇద్దరు ముగ్గురు యంగ్ డైరెక్టర్స్ కు విజయ్ దేవరకొండ కమిట్ అయ్యాడని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్టులను అటు సుకుమార్, ఇటు విజయ్ దేవరకొండ పూర్తి చేసుకుని, వీరిద్దరి కాంబోలో మూవీ రావాలంటే మరో ఐదేళ్లు లేదా అంతకంటే ఎక్కువే వెయిట్ చేయక తప్పదు అనిపిస్తోంది.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు