Suhas : ఏడాదిలో ఏడు.. మామూలు రచ్చ కాదు!

టాలీవుడ్ లో టాలెంట్ తో పాటు లక్ కూడా ఉండాలి అంటారు కొందరు. ఆ రెండూ ఉన్న సుహాస్ లక్కీ హీరో అని చెప్పాలి. తెలుగు ఇండస్ట్రీలో షార్ట్ ఫిల్మ్స్ ద్వారా ఎంట్రీ ఇచ్చి, చిన్న పాత్రలు వేస్తూ, ఆ తరువాత కలర్ ఫోటో సినిమాతో ఏకంగా హీరోగానూ సక్సెస్ అయ్యి తన టాలెంట్ తో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరో సుహాస్. పదేళ్ల కిందటే షార్ట్ ఫిలిమ్స్ తో ఫేమస్ అయినా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో గుర్తింపు రావడానికి కొంత టైం పట్టింది. లాక్ డౌన్ సమయంలో ఓటిటి లో కలర్ ఫోటో సినిమాతో మంచి హిట్ట్టు కొట్టిన సుహాస్, ఆ తర్వాత వరుస హిట్లతో దూసుకుపోయాడు. గతేడాది రైటర్ పద్మభూషణ్ తో హిట్ కొట్టిన ఈ కుర్ర హీరో ఈ ఇయర్ లో రీసెంట్ గా అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్ తో మరోసారి ఆడియన్స్ ని మెప్పించాడు. ప్రస్తుతం ఓటీటీలో కూడా బ్యాండ్ మోగిస్తుంది. అయితే ప్రస్తుతం సుహాస్ టాలీవుడ్ లో అందరికంటే బిజీయెస్ట్ హీరోగా మారిపోయాడని చెప్పాలి. వరుస సక్సెస్ లతో చిన్న హీరోల్లో మంచి మార్కెటింగ్ ఏర్పరచుకొని వరుస చిత్రాల్ని కూడా లైన్లో పెట్టాడు. పైగా ఆ సినిమాల్లో కూడా సుహాస్ హీరోయే కావడం విశేషం.

ఏడుకి పైగా సినిమాలు..

ప్రస్తుతం సుహాస్ చేస్తున్న సినిమాల సంఖ్య టాలీవుడ్ లో అందరికంటే ఎక్కువే అని చెప్పాలి. లెక్కేస్తే ఆ సినిమాలన్నీ కలిపి ఏడు కి పైగానే అయ్యాయి. అవును.. సుహాస్ ఈ ఇయర్ లోనే ఏడుకి పైగా సినిమాల్లో నటిస్తుండడం విశేషం. ఆ సినిమాల వివరాలు చూస్తే.. ఈ ఇయర్ లో ఆల్రెడీ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ తో పలకరించి హిట్టు కొట్టాడు. ఇక నెక్స్ట్ విరాజ్ తో కలిసి శ్రీ రంగ నీతులు సినిమాతో రానున్నాడు. అలాగే నెక్స్ట్ మంత్ ప్రసన్నవదనం సినిమాతో ఆడియన్స్ ని పలకరిస్తాడు. ఇక ఇవే గాక కేబుల్ రెడ్డి, ఆనందరావు అడ్వెంచర్స్, గొర్రె పురాణం, లేటెస్ట్ గా ఉప్పు కప్పురంబు, జనక అయితే గనక (వర్కింగ్ టైటిల్) సినిమాలు లైన్లో ఉన్నాయి. ఇవన్నీ లెక్కేస్తే ఆల్రెడీ రిలీజ్ అయిన అంబాజీపేట తో కలిపి ఏకంగా ఎనిమిది సినిమాలు అవుతాయి. ఇక ఇందులో అరడజను సినిమాలతో ఈ ఇయర్ రావాలని ప్లాన్ చేస్తున్నారట.

- Advertisement -

నాలుగు నెలల్లో నాలుగు..

సుహాస్ ఆల్రెడీ ఈ ఇయర్ లో ఫిబ్రవరి లో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ తో పలకరించగా, వచ్చే నెల నుండి అంటే ఏప్రిల్ నుండి వరుసగా నాలుగు నెలల్లో నాలుగు సినిమాలు సుహాస్ నుండి రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మూవీ మేకర్స్. ఏప్రిల్ లో శ్రీ రంగ నీతులు సినిమాతో రానున్నాడు. ఇక మే 3న ప్రసన్న వదనం సినిమాతో వస్తున్నాడని ఆల్రెడీ అనౌన్స్ మెంట్ అయింది. ఇక జూన్ లో కేబుల్ రెడ్డి, జులై లో గొర్రె పురాణం సినిమాతో ఆడియన్స్ ని పలకరించబోతున్నారట. ఇందులో ఆల్రెడీ రెండు సినిమాల షూటింగ్ పూర్తయింది. అయితే వినడానికి బాగానే ఉన్నా నాలుగు నెలల్లో నాలుగు సినిమాలు అంటే కష్టమే అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. కానీ అన్నీ నార్మల్ బడ్జెట్ చిన్న సినిమాలే కాబట్టి వచ్చినా రావచ్చు.

అయితే ఇంత తక్కువ గ్యాప్ లో వరుస బెట్టి సుహాస్ సినిమాలు రిలీజ్ కావడం వల్ల అది కూడా సుహాస్ కి ఒకరకమైన నష్టం తేవొచ్చని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే నెల గ్యాప్ లో వరుసబెట్టి సినిమాలు రిలీజ్ చేయడం వల్ల ఆడియన్స్ కి సుహాస్ సినిమాలపై కాస్త బోర్ కొట్టొచ్చు. అది ఓపెనింగ్స్ పై ప్రభావం చూపొచ్చని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి సుహాస్ నుండి రాబోయే రోజుల్లో ఈ ఇయర్ లో ఎన్ని సినిమాలు దింపుతాడో, ఎన్ని సినిమాలతో హిట్లు కొడతాడో చూడాలి.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు