Sukumar : చరణ్ తో ఈసారి ఏమి చేయిస్తాడో

చిరుత సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు రామ్ చరణ్. రామ్ చరణ్ కెరియర్ లో ఎన్నో అద్భుతమైన హిట్ సినిమాలు ఉన్నాయి. అయితే మొదటి సినిమాతోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని చిరు తనయుడు అనిపించుకున్నాడు. తన యాక్టింగ్ తో, డాన్స్ పర్ఫామెన్స్ తో మెగా ఫ్యాన్స్ కి ఒక హోప్ ఇచ్చాడు. ఇకపోతే చరణ్ నటించిన రెండో సినిమా మగధీర ఈ సినిమా సృష్టించిన రికార్డ్స్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమా అప్పట్లో ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డ్ సృష్టించింది.

ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా చాలామంది ఆడియన్స్ ను సప్రైజ్ చేసింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లో ఉన్న ప్లస్ పాయింట్స్ అన్నిటిని అద్భుతంగా వాడి ఆ సినిమాని హిట్ దిశగా మలిచాడు రాజమౌళి. అక్కడితో చరణ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. మగధీర తర్వాత చేసిన ఆరెంజ్ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. అప్పటికే ఆరెంజ్ సినిమా పాటలు అద్భుతంగా హిట్ అవడంతో ఈ సినిమా మీద అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. కానీ అంచనాలను ఆరెంజ్ సినిమా అందుకోలేకపోయింది.

ఆ తర్వాత బాలీవుడ్ లో జంజీర్ అనే సినిమాను చేశాడు చరణ్. ఆ సినిమా కూడా తీవ్ర నిరాశకు గురిచేసింది. బాలీవుడ్ లో చాలామంది రామ్ చరణ్ ట్రోల్ కూడా చేశారు. ఆ తర్వాత చేసిన రచ్చ నాయక్ వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించాయి. కానీ చరణ్ ఫ్యాన్స్ కు మాత్రం సంతృప్తిని ఇవ్వలేదు. ఆ తర్వాత చేసిన గోవిందుడు అందరివాడు బ్రూస్లీ అంటే సినిమాలు పర్వాలేదు అనిపించుకున్నాయి.

- Advertisement -

తనివరుణ్ అనే సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ధ్రువ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ ను రాబట్టింది. చరణ్ కూడా యాక్టర్ గా ఒక మెట్టు ఎక్కించింది ఆ సినిమా. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించింది. చరణ్ మిగతా సినిమాలు అన్నిటిలో కంటే ఆ సినిమాలో అద్భుతంగా నటించాడు అని ప్రశంసలను కూడా పొందుకున్నాడు.

ఇకపోతే చరణ్ కెరియర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అంటే రంగస్థలం అని చెప్పొచ్చు. చరణ్ పరిపూర్ణమైన నటుడిని బయటికి తీసిన సినిమా రంగస్థలం. రంగస్థలం సినిమాతో సుకుమార్ లోని ఒక కొత్త దర్శకుడు కూడా బయటకు వచ్చాడు. అప్పటివరకు క్లాస్ మూవీస్ తీసే సుకుమార్ ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ పొలిటికల్ డ్రామాని అద్భుతంగా వెండితెరపై తెరకెక్కించాడు. ఈ సినిమాతో సుకుమార్ ఎనలేని కీర్తిని సంపాదించాడు.

ఇకపోతే చరణ్ కి రంగస్థలం సినిమా తర్వాత ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది అని చెప్పొచ్చు. ఆ సినిమా తర్వాత ట్రిపుల్ ఆర్ అనే సినిమాలో నటించాడు రామ్ చరణ్. ఇక్కడితో గ్లోబల్ స్టార్ అయిపోయాడు చరణ్. అయితే చరణ్ ఇప్పుడు మళ్లీ సుకుమార్ తో సినిమాను చేయనున్నారు అనే వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ చరణ్ బర్త్ డే రోజు రానుంది. ఇకపోతే అందరికంటే ముందు ఈ వార్తను లీక్ చేసింది ఎస్ ఎస్ రాజమౌళి అని చెప్పొచ్చు. రాజమౌళి ఆర్ ఆర్ సినిమా ప్రోమోషన్స్ లో భాగంగా హాజరైన ప్రతి చోట సుకుమార్ సినిమాలో, రామ్ చరణ్ ఇంట్రడక్షన్ ఉంటుంది నేను దానికోసం క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నాను. అది నాకు తెలుసు అంటూ ఇదివరకే చెప్పుకొచ్చాడు.

Check out Filmify Telugu for Tollywood Movie news updates, latest Kollywood news, Movie Reviews & Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip in tollywood & all other Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు